ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అనగానే మనకు మహా కుంభమేళా గుర్తుకువస్తుంది. దాదాపుగా 144 ఏళ్ల తర్వాత ఈ మహా కుంభమేళా జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ మహా కుంభమేళా అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కోట్లాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నాలను ఆచరిస్తున్నారు. అయితే కుంభమేళాకు చాలామంది వెళ్లి వస్తూ ఉంటారు.. అలా వెళ్ళిన వారు కల్పవృక్షంగా పిలవబడే ఒక చెట్టును తప్పకుండా సందర్శించాలని చెబుతున్నారు. ఆ చెట్టు పేరు ఏమిటి? ఆ చెట్టు ఎక్కడ ఉంటుంది దాన్ని సందర్శించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కల్పవృక్షాన్ని సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన దివ్య వృక్షంగా పరిగణిస్తారు. వేల సంవత్సరాల పాటు జీవించే కల్పవృక్షాన్ని కోరికలు తీర్చే వృక్షంగా కూడా పరిగణిస్తారు. ప్రపంచంలోని రెండవ అతి పురాతన కల్పవృక్షం ప్రయాగ్ రాజ్ నగర శివార్లలో ఉండే ఝూసీ అనే టౌన్ లో ఉంది. ఈ చెట్టు వయస్సు దాదాపుగా 800 సంవత్సరాల పైనే ఉంటుందట. ప్రజలు ఈ చెట్టుని బుధ బాబా అని పిలుస్తారు. ఆఫ్రికాలో మొదటిది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ప్రయాగ్‌రాజ్, బారాబంకిలో ఉన్న కల్పవృక్షం రెండు చెట్లు 800 సంవత్సరాల నాటివని గుర్తించారు. మూడవ పురాతన కల్పవృక్షం శ్రీలంకలోని మన్నార్ పట్టణంలో ఉంది.
దీని వయస్సు 750 సంవత్సరాలుగా గుర్తించారు. ప్రపంచంలో అత్యంత పురాతన కల్పవృక్షం ఆఫ్రికాలో ఉంది. దాని వయస్సు రెండు వేల సంవత్సరాలు. యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ నుండి పొందిన రేడియోకార్బన్ ఆధారంగా ఈ చెట్ల వయస్సుని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ప్రయాగ్ రాజ్ లోని ఝూసీలో ఉన్న కల్పవృక్షంతో పాటుగా బారాబంకిలోని కింటూర్ లో ఉన్న కల్పవృక్షం దాదాపు 1200 సంవత్సర కాలంలో పెరగడం ప్రారంభించిందని చెబుతున్నారు. ఈ చెట్టు ఆఫ్రికన్, అరబ్ నావికులు హిందూ మహాసముద్రపు తీర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి వచ్చిన పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ ఆక్రమ దారుల ద్వారా భారతదేశానికి చేరుకుందని నమ్ముతారు. ప్రయాగ్ రాజ్ చెట్టు 14 మీటర్ల ఎత్తు ఉంటుంది కల్పవృక్షం గంగా నది ఎడమ ఒడ్డున ఉన్న భారీ మట్టి దిబ్బపై విస్తరించి ఉంది. దీని వెడల్పు 21.2 మీటర్లు, ఎత్తు 14 మీటర్లు. బారాబంకి జిల్లాలోని కింటూర్ గ్రామ సమీపంలో ఉన్న పారిజాతం 13.7 మీటర్ల ఎత్తు, దానివెడల్పు 14.10 మీటర్లు. నీరు లేకపోవడం వల్ల శక్తి ప్రభావితమవుతుంది. కల్పవృక్షం చెక్కలో నీటి శాతం దాదాపు 79 శాతం ఉంటుంది. దాని కారణంగా అది నిటారుగా ఉంటుంది. ప్రయాగ్ రాజ్ బారాబంకిలో ఉన్న కల్పవృక్ష నీటిమట్టం తగ్గుముఖం పట్టడం ఆందోళనకరం. కాబట్టి మీరు కూడా ప్రయాగ్ రాజ్ వెళితే తప్పకుండా ఆ చెట్టుని సందర్సించాలని చెబుతున్నారు.