Hair Tips: అబ్బాయిలు మీరు అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే బట్టతల రావడం ఖాయం!

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువకులకు చిన్న వయసులోనే అనగా 28,29 ఏళ్ల వయసు వచ్చేసరికి బట్టతల వచ్చేస్తోంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. రక

Published By: HashtagU Telugu Desk
Mixcollage 07 Dec 2023 06 08 Pm 8483

Mixcollage 07 Dec 2023 06 08 Pm 8483

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువకులకు చిన్న వయసులోనే అనగా 28,29 ఏళ్ల వయసు వచ్చేసరికి బట్టతల వచ్చేస్తోంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. రకరకాల షాంపూలను ఉపయోగించడం హెయిర్ స్టైల్స్ చేయించుకోవడం అలాగే స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం లాంటి ఎన్నో కారణాల వల్ల బట్టతల వస్తుంది. అయితే బట్టతల మీద జుట్టు రావడం కోసం చాలామంది అనేక రకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు కొన్ని రకాల ట్రీట్మెంట్ లు కూడా చేయించుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు.

ముఖ్యంగా చిన్న వయసులోనే బట్టతల వస్తే ఎంతో బాధపడుతూ ఉంటారు. సహజంగా ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా బట్టతల వస్తుంది. మానవ జన్యు పరులలో బాల్నెస్ జీన్స్ అండ్ రోజెనిటిక్ అలోపిసియ కారణంగా బట్టతల వస్తుంది. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు యువకులు చేసిన చిన్న చిన్న పొరపాట్లు బట్ట తలకు కారణమవుతాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మగవారిలో 21 ఏళ్లు లోపు వయసున్న వారిలో 25 శాతం మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఆ తదుపరి వయసు పెరిగే కొద్దీ 70 శాతం మందికి జుట్టు రాలడం మొదలవుతుంది.

డై హో ట్రాన్ అని హార్మోన్ వలన తలపై జుట్టు వేగంగా రాలిపోతూ ఉంటుంది. ఐరన్ ప్రోటీన్లు అధికంగా ఉండే పాలకూర, మటన్, చికెన్, గుమ్మడి గింజలు, బ్లాక్ బీన్స్ గుడ్లు, పాలు లాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే జుట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

  Last Updated: 07 Dec 2023, 06:08 PM IST