Site icon HashtagU Telugu

Uric Acid: యూరిక్‌ యాసిడ్‌.. గౌట్ సమస్యలను జయిద్దాం

Uric Acid.. Gout Problems

Let's Conquer Uric Acid.. Gout Problems

రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ (Uric Acid) మోతాదు పెరగడాన్ని ‘హైపర్‌ యూరిసెమియా ‘ అంటారు. యూరిక్ యాసిడ్ అనేది మన రక్తంలోని వ్యర్థపదార్థం. సాధారణంగా మూత్రపిండాలు ఫిల్టర్‌ చేయడం ద్వారా మూత్రాన్ని బయటికి పంపిస్తాయి. అయితే కొన్ని సార్లు మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయని సందర్భాలు ఉంటాయి. అటువంటి సమయంలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడుతాయి. ఇవి విచ్ఛిన్నమై శరీరంలోని కీళ్లలోకి చేరుతాయి. ఎముకలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆర్థరైటిస్, వాపు, కీళ్ల నొప్పి సమస్యలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు గౌట్(వ్రేళ్ళ దగ్గర పుళ్ళుపడే వ్యాధి) అనే సమస్య మొదలవుతుంది.

యూరిక్‌ యాసిడ్‌ (Uric Acid) మోతాదు బాడీలో పెరిగిపోవడం వల్ల కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, చేతి, కాలి వేళ్లు ఉన్నట్లుండి ఎర్రగా వాచిపోవడం వంటి గౌట్‌ సమస్యలు తలెత్తుతాయి. ప్యూరిన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తింటే కూడా యూరిక్ యాసిడ్ మోతాదుకు మించి ఉత్పత్తి అవుతుంది. ప్యూరిన్లు అనేవి కార్బన్ , నైట్రోజన్ అణువులతో తయారైన రసాయన సమ్మేళనాలు. ఇవి శరీరంలో విచ్ఛిన్న మవుతాయి. ఫలితంగా  యూరిక్ యాసిడ్, హైపర్‌ యూరిసెమియా అనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ యొక్క స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో స్థిరపడుతాయి. దీన్నే
“గౌట్” అంటారు.

యూరిక్ యాసిడ్ (Uric Acid) తగ్గించడం ఎలా?

మన మూత్రపిండాలు అధిక మోతాదులో ఉన్న యూరిక్ యాసిడ్ లను తొలగించాలి. ఒకవేళ అవి ఆ పనిని చేయలేనప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఏర్పడుతుంది. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం, చక్కెరను ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంటుంది. ఇది శరీరంలో బాధాకరమైన మంటను కలిగిస్తుంది . యూరిక్ యాసిడ్ అనేది గౌట్ లేదా కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. కొన్ని జీవనశైలి మార్పులు, ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తొలగించడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించవచ్చు.

గౌట్ సమస్య – లక్షణాలు

  1. యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా ఏర్పడి మన కీళ్ళలో స్థిరపడుతుంది. ఈ సమస్యనే “గౌట్” అంటారు.
  2. గౌట్ మీ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా చీలమండలు, మోకాలు, మోచేతులు, మణికట్టు , వేళ్లు దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి.
  3. గౌట్ వల్ల కలిగే నొప్పి ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల మీరు దీర్ఘకాలిక అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఇది కొన్ని వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగవచ్చు.
  4. ఈ పరిస్థితిలో కీళ్లను కదలించడం కూడా కష్టంగా అనిపించవచ్చు.
  5. వాపు వచ్చి లేత మరియు ఎరుపు రంగులోకి కీళ్ళు మరే అవకాశం ఉంటుంది.

యూరిక్ యాసిడ్ (Uric Acid) పెరగొద్దంటే ఇవి తీసుకోవద్దు.

  1. రెడ్ మీట్, సీఫుడ్, ఆర్గాన్ మీట్, బీర్, విస్కీ వంటి అనేక ఆహారాలలో ప్యూరిన్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండండి.
  2. ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ అనేది గౌట్ ముప్పును పెంచుతుంది. బీర్ తాగొద్దు.
  3. కృత్రిమ తీపి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. గౌట్‌ సమస్యను ప్రేరేపిస్తాయి. సోడా, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, పేస్ట్రీలు, క్యాండీలు, క్యాన్డ్ సూప్‌లు, కెచప్ , మయోనైస్ వంటి మసాలాలకు దూరంగా ఉండండి.

యూరిక్ యాసిడ్ (Uric Acid) పెరగొద్దంటే ఇవి తీసుకోండి

  1. విటమిన్ సి ఆహారాలను ఎక్కువగా తినండి. విటమిన్ సి యొక్క ఉత్తమ మూలాలలో  సిట్రస్ పండ్లు, మిరియాలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, బంగాళదుంపలు ఉన్నాయి.
  2. మీరు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. ఇది మీ బాడీ నుంచి యూరిక్ యాసిడ్‌ను ఫ్లష్ చేయడంలో సహాయపడుతుంది.
  3. ప్యూరిన్లు తక్కువగా ఉండే ఆహారంలో పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలు ఉన్నాయి.
  4. ఖర్జూరం, ఎండుద్రాక్షల అధిక వినియోగం మన బాడీలో యూరిక్ యాసిడ్‌ను ప్రోత్సహిస్తుంది. వీటిలో ప్యూరిన్ ఉంటుంది. ఇవి గౌట్ సమస్యను పెంచుతాయి.

చింతపండు: కీళ్లనొప్పులు ఉన్న రోగులు చింతపండు తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇందులోని ఫ్రక్టోజ్ అనేది యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే చింతపండు గుజ్జును తినకండి.

బిస్కెట్: దాదాపు ప్రతి ఒక్కరూ బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది మంచిది.కానీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే, బిస్కెట్ల వినియోగం హానికరం. బిస్కెట్లలో కూడా అధిక మొత్తంలో ప్యూరిన్లు, ఫ్రక్టోజ్ ఉంటాయి.

యాపిల్: రోజూ ఒక యాపిల్ తినడం గురించి వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. యాపిల్‌లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇందులో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. దీని అధిక వినియోగం గౌట్ సమస్యను పెంచుతుంది.

చాక్లెట్, చిప్స్: పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చాక్లెట్లు, చిప్స్ ఇష్టపడతారు. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే దాని వినియోగం అనేక సమస్యలను కలిగిస్తుంది. వేయించిన వస్తువులు యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి.

సపోటా: సపోటా చాలా మందికి ఇష్టమైన పండు. అయితే ఇందులో ఫ్రక్టోజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు కీళ్లలో నొప్పి అనిపిస్తే సపోటా తినకుండా ఉండాలి.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పుట్టగొడుగులు, పచ్చి బఠానీలు, బచ్చలికూర, క్యాలీఫ్లవర్, కిడ్నీ బీన్స్, ఎండు బఠానీలు, పప్పులు తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

యూరిక్‌ యాసిడ్‌ (Uric Acid) సమస్యకు నేచురల్ చెక్ ఇలా..

  1. తమలపాకుతో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.
  2. నిమ్మరసం అనేది రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతుంది.
  3. శరీరంలో అధిక యూరిక్‌ యాసిడ్‌తో బాధపడేవారు.. 6 వారాల పాటు ప్రతిరోజు తాజా నిమ్మరసం (రోజుకు ఒక నిమ్మకాయ) తాగితే మంచిదని అంటారు.
  4. తిప్ప తీగతో.. యూరిక్‌ యాసిడ్‌ సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగ ఆకును, తిప్పతీగను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం గ్లాస్‌ వాటర్‌లో వేసి, సగం అయ్యే వరకు మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి తాగాలి.
  5. కాకర కాయ రసానికి యూరిక్‌ యాసిడ్‌ తగ్గించే సామర్థ్యం ఉందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

Also Read:  Pre Diabetes Symptoms: బీ అలర్ట్.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు ఇవీ