Laziness : మీరు బద్దకంగా ఉండడానికి కారణం ఈ ఆహారమే !!

Laziness : ఇవి తాత్కాలిక చురుకుతనాన్ని కలిగించినా, అధికంగా తీసుకుంటే నిద్రలేమి, మానసిక అలసటకు దారితీస్తాయి.

Published By: HashtagU Telugu Desk
Laziness

Laziness

ఈరోజుల్లో బద్ధకం(Laziness )గా ఉండడం, పనిపై ఫోకస్ లేకపోవడం, శారీరక అలసట వంటివి చాలామందిలో కనిపిస్తున్నాయి. తక్కువ వయసులోనే ఎక్కువ మందిలో కనిపిస్తున్న ఈ సమస్యలకు కారణాలు కేవలం జీవనశైలికి మాత్రమే కాక, రోజూ తీసుకునే ఆహారానికి సంబంధం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారాలు తాత్కాలికంగా శక్తినివ్వగలిగినా, అవి తక్కువ సమయంలోనే బద్ధకాన్ని కలిగించేలా చేస్తాయి. ముఖ్యంగా బ్రెడ్, కేక్, పఫ్ వంటి బేకరీ పదార్థాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని ఒక్కసారిగా పెంచి వెంటనే తగ్గించడంవల్ల, మెదడులో అలసట మరియు బద్దకానికి దారి తీస్తాయి.

Case File : జగన్ తో పాటు వైసీపీ నేతలపై కేసులు నమోదు..ఎందుకంటే !

బద్దకాన్ని పెంచే ఆహారాల్లో అధిక క్యాఫిన్‌ ఉన్న కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ కూడా చేరతాయి. ఇవి తాత్కాలిక చురుకుతనాన్ని కలిగించినా, అధికంగా తీసుకుంటే నిద్రలేమి, మానసిక అలసటకు దారితీస్తాయి. అలాగే చెర్రీస్‌లో ఉన్న మెలటోనిన్ అనే సహజ నిద్ర హార్మోన్ పనిచేసే సమయంలో తీసుకుంటే నిద్రను ప్రేరేపించి బద్దకాన్ని కలిగిస్తుంది. పాస్తా, పిజ్జా వంటి ప్రాసెస్‌డ్ ఫుడ్స్ జీర్ణక్రియను మందగించి శరీరాన్ని నిస్సత్తువుగా మార్చడమే కాక, దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి.

Sridhar Babu : పెట్టుబడులు ప్రోత్సహించండి అంటూ ‘ఇఫ్కీ’ ప్రతినిధులకు శ్రీధర్ బాబు విజ్ఞప్తి

బద్ధకాన్ని తగ్గించాలంటే ఆహారపు అలవాట్లను మారుస్తే సరిపోతుంది. ప్రాసెస్‌డ్ మరియు వేయించిన పదార్థాలకు బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, తేలికగా జీర్ణమయ్యే ప్రొటీన్‌ ఆధారిత ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగటం, రోజూ కనీసం 15-30 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. ఈ విధంగా సరైన ఆహార నియమాలు పాటించటం ద్వారా బద్దకాన్ని నియంత్రించవచ్చు.

  Last Updated: 24 Jun 2025, 05:52 PM IST