Site icon HashtagU Telugu

Smoking Effects: యవ్వనంపై ధూమపానం దెబ్బ, అతిగా పొగ తాగితే ముసలితనమే!

Cigarette Smoking

Cigarette Smoking

Smoking Effects: మీరు చాలా కాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అయితే వెంటనే ధూమపానం మానేయండి. ఎందుకంటే ఇది మీ ఊపిరితిత్తులతో పాటు మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తోంది. అంతేకాదు.. వయస్సు పై ప్రభావం చూపి ముసలితనం వచ్చేలా చేస్తోంది. దాదాపు 500,000 మంది వ్యక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఓ లేటెస్ట్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇటలీలోని మిలన్‌లోని యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ అధ్యయనంలో ధూమపానం మనిషి రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలలో క్రోమోజోమ్‌ల చివరి శకలాలు తగ్గిస్తుందని తేలింది. మనిషి ఎంతగా పొగ తాగితే, అంత త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయని స్పష్టమైంది. పునరుత్పత్తి చేసే కణాల సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుందట. “మా అధ్యయనం ధూమపానం వృద్ధాప్యానికి కారణమవుతుందని రుజువు అయిందని, ధూమపానం మానేయడం వల్ల మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున, అలాంటి వ్యక్తి యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటున్నారు’’ అని పరిశోధకులు చెబుతున్నారు. పొగ తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ముసలితనం కూడా వస్తుందని తాజాగా ఈ సర్వే చెబుతోంది.

స్మోకింగ్ మానాలంటే దాన్నుంచి మైండ్ డైవర్ట్ చేయాలి. అలా చేయాలనుకుంటే నికొటిన్ రిప్లేస్మెంట్ థెరపీ (ఎన్ఆర్టి) ప్రయత్నించాలి. అదెలాగంటే… నాజల్ స్ర్పే లేదా ఇన్హేలర్ ద్వారా నికొటిన్ని తీసుకోవడం. నికొటిన్ ప్యాచెస్, గమ్, లాంజెస్ వంటివి తీసుకోవడం. లేదంటే బుప్రొపియన్, వరెనిక్లైన్ అనే మందులు వాడొచ్చు. అలాగే, స్మోకింగ్ మానడానికి ఈ మధ్య ఇ– సిగరెట్ల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ, ఇ– సిగరెట్లు సేఫ్, నికొటిన్ని రీప్లేస్ చేసేందుకు పనికొచ్చే మెడిసిన్ అని గానీ, ప్రజలు స్మోకింగ్ మానేయడానికి సాయం చేస్తుందని గానీ ఎక్కడా రుజువు కాలేదు. అందుకే మన దేశంలో ఇ– సిగరెట్ల అమ్మకాలపై బ్యాన్ పెట్టారు.

Also Read: IND vs SL: ఆసియా కప్ లో కీలక మ్యాచ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!

Exit mobile version