Site icon HashtagU Telugu

Late Night Sleep : రాత్రివేళ ఆలస్యంగా పడుకునేవారికి షాకింగ్ న్యూస్..

late night sleep effect

late night sleep effect

Late Night Sleep : బిజీ బిజీ లైఫ్.. సంపాదన వెంట పరిగెడుతూ.. ఆరోగ్యాన్ని మరిచిపోతున్నాం. డబ్బుకోసం మాత్రమే కాదు.. సినిమాలు చూస్తూ.. లేట్ నైట్ కాల్స్ మాట్లాడుతూ.. చాలా మంది చాలా లేట్ గా నిద్రపోతుంటారు. దీని వల్ల ప్రొటీన్ లోపం తలెత్తుతుంది. ప్రొటీన్ శరీరానికి చాలా అవసరం. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. వివిధ రకాల ఎంజైమ్స్, హార్మోన్ల తయారీకి కూడా ప్రొటీన్ చాలా అవసరం.

ఈ రోజుల్లో చాలామంది ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఒక కేజీ బరువుకు 1 గ్రాము ప్రొటీన్ చొప్పున.. శరీర బరువు ఎంత ఉంటే అన్నిగ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. అయినప్పటికీ ఎంతో కొంత ప్రొటీన్ లోపం ఉంటుంది. శరీరంలో చనిపోయిన మృతకణాల్లో కూడా చాలా ప్రొటీన్ ఉంటుంది. ఇలా చనిపోయిన కణాల్లో ఉండే ప్రొటీన్ ను మన శరీరం తిరిగి వాడుకోగలదు. శరీరంలో ఈ ప్రక్రియ జరిగితేనే శరీరంలో ప్రొటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. ఇదంతా మనం నిద్రించిన తర్వాతే జరుగుతుంది. రాత్రి సమయంలో శరీరం విశ్రాంతిలో ఉన్నపుడు ఈ ప్రక్రియ జరుగుతుంది.

ఆలస్యంగా నిద్రించడం వల్ల మృతకణాల నుంచి విడుదలవ్వాల్సిన ప్రొటీన్ విడుదలవ్వదు. ఫలితంగా ప్రొటీన్ లోపం తలెత్తుతుంది. ఇది కొంత అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకే రోజూ సాయంత్రం ఆహారాన్ని త్వరగా తిని.. త్వరగా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ప్రొటీన్ రీ సైకిల్ అయ్యే ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది.