Site icon HashtagU Telugu

Laser Treatment: గుండె రక్తనాళాల్లో కొవ్వుకు లేజర్ చికిత్స

Laser treatment of fatty deposits in the heart blood vessels

Heart

రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును(ప్లాక్స్) తొలగించే మరో గొప్ప వైద్య ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగుతున్న లైవ్ కాన్‌క్లేవ్‌లో మెదాంతా హాస్పిటల్‌కు చెందిన డా. ప్రవీణ్ చంద్రా ఈ చికిత్సను పరిచయం చేశారు. తీక్షణమైన లేజర్ కిరణాలతో రక్తనాళాల్లోని కొవ్వు ప్లాక్స్ ఆవిరైపోతాయని చెప్పారు. సాధారణ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఇది ఎంతో సులువైనది పేర్కొన్నారు. రక్తనాళం గుండా క్యాథెటర్ పంపించి లేజర్‌తో అడ్డంకులు తొలగిస్తామని తెలిపారు. ఈ టెక్నాలజీతో ఇప్పటివరకూ తమ ఆస్పత్రిలో 55 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అధికశాతం సందర్భాల్లో లేజర్ చికిత్స (Laser Treatment) తరువాత రోగులకు స్టెంట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. దీంతో.. రక్తనాళాల గోడలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అడ్డంకులను తొలగించి రక్తప్రసరణను పునరుద్ధరించొచ్చని చెప్పారు.

ఈ లేజర్ చికిత్స (Laser Treatment) రోగికి ఇబ్బందులు తక్కువగా ఉండటంతో పాటూ చికిత్స తరువాత కొద్ది రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఆధునాతన చికిత్సలను నాగ్‌పూర్ వైద్యులకు పరిచయం చేయడమే తమ ఉద్దేశమని ‘లైవ్ కాన్‌క్లేవ్‘ సమావేశం నిర్వాహకులు డా. జస్పాల్ ఆర్నేజా పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా విదర్భ ప్రాంతంలోని సుమారు 200 మంది వైద్యులు తొలిసారిగా ఈ చికిత్స గురించి తెలుసుకోగలిగారని చెప్పారు.

Also Read:  Letter Delivered After 100 Years: 100 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన లెటర్