Kuwaiti: అక్కడ పెళ్లి చేసుకుంటే నెల నెలా జీతాలు ఇస్తారు.. మరిన్ని వివరాలు తెలియాలంటే ఇది చదవండి!

సాధారణంగా ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక రకాలుగా పథకాలు, సంక్షేమ పథకాలను తీసుకు వస్తూ ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
L4rm6nmu

L4rm6nmu

సాధారణంగా ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక రకాలుగా పథకాలు, సంక్షేమ పథకాలను తీసుకు వస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధంగా పథకాలను అమలులోకి తీసుకు వస్తూ ఉంటుంది. అయితే కువైట్ ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకాల వల్ల కుటుంబ బాంధవ్యాలు బలోపేతం అవుతాయని.. అదే విధంగా స్త్రీలకు నెలనెలా కొంచెం ఆదాయం వస్తే వాళ్లు కూడా ఒకరిపై ఆధారపడకుండా పిల్లల పోషణ వాళ్ల ఎదుగుదలపై దృష్టి పెడతారని అందువల్లే కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు.

అసలు కువైట్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటంటే.. కేవలం పెళ్లి చేసుకుంటే చాలు మీరు ఆఫీస్ కు వెళ్లకున్నా,పర్వాలేదు నెల జీతం అకౌంట్లో పడిపోతుందట. అదెలా అంటే కువైట్ కు చెందిన మహిళలు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి తర్వాత వాళ్లు జాబ్ చేయాల్సిన పనిలేదు. ప్రభుత్వాలకు నెల నెల జీతం ఇస్తుంది. అందుకు కొన్ని షరతులు కూడా విధించింది. పెళ్లి చేసుకొని ఏ ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం చేయకూడదట,అలాగే ప్రైవేట్ కంపెనీల్లో కూడా పని చేయకూడదట,అలాగే ఇన్స్టిట్యూట్లలను స్థాపించి ఉండకూడదట..

అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మహిళలు ఎటువంటి జాబ్ లేకుండా ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీని పోషించడానికి ఎటువంటి ఆధారం లేని మహిళలకు ఆర్థికంగా ఆదుకునే పథకం. దీనికి కువైట్ ప్రభుత్వం జీతం అనే పథకం పేరు పెట్టింది. అయితే ఈ పథకం వల్ల కుటుంబ బాంధవ్యాలు బలోపేతం అవుతాయని, అంతే కాకుండా స్త్రీలకు నెలనెలా కొంచెం డబ్బులు వస్తాయని,దీంతో మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటారు అని కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  Last Updated: 03 Jun 2022, 10:39 AM IST