Kunda Biryani: హోటల్ స్టైల్ కుండ బిర్యాని ఇంట్లోనే చేసుకోండిలా?

మామూలుగా చాలామంది ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో రెస్టారెంట్లకు హోటల్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా కుండా బిర్యాని తినడానికి ఆశపడుతూ ఉంటారు. కా

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 08:00 PM IST

మామూలుగా చాలామంది ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో రెస్టారెంట్లకు హోటల్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా కుండా బిర్యాని తినడానికి ఆశపడుతూ ఉంటారు. కానీ చాలామంది హోటల్స్ రెస్టారెంట్ లో చేసిన బిర్యానీ కంటే ఇంట్లోనే కుండ బిర్యాని చేసుకుని తినాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఎలా చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో కుండ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

చికెన్ – అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూనులు
పచ్చిమిర్చి – రెండు
ఉల్లిపాయ తరుగు – అరకప్పు
పెరుగు – అరకప్పు
కారం – రెండు టీ స్పూనులు
జీలకర్ర పొడి – పావు టీస్పూను
పసుపు – అర టీస్పూను
నిమ్మరసం – రెండు స్పూనుల
కొత్తిమీర తరుగు – పావు కప్పు
బిర్యానీ ఆకు – రెండు
గరం మసాలా – రెండు స్పూనులు
మిరియాల పొడి – అర స్పూను
నెయ్యి – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – వంటకు తగినంత
బాస్మ‌తి బియ్యం – అరకిలో
ఉప్పు – రుచికి సరిపడా
లవంగాలు – ఆరు
దాల్చిన చెక్కలు – రెండు ముక్కలు
యాలకులు – అయిదు
కొత్తిమీర తరుగు – అరకప్పు
పుదీనా తరుగు – అరకప్పు
షాజీరా – ఒక స్పూను
అనాస పువ్వు – రెండు
జాజికాయ – చిన్న ముక్క
మరాఠీ మొగ్గ – రెండు

కుండ బిర్యానీ తయారీ విధానం

ముందుగా బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగి ఓ అరగంట పాటూ నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ వేసుకుని అందులో పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి మారినేషన్ చేయాలి. దాదాపు అరగంట పాటూ పక్కన వదిలేయాలి. మరో పక్క బిర్యానీ రైస్ వండేందుకు రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి బాస్మతి రైస్ తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి ఉడికించాలి. నీళ్లు కాగుతున్నప్పుడు బాస్మతి బియ్యాన్ని వేయాలి. బియ్యం సగం ఉడికాక స్టవ్ కట్టేయాలి. నీళ్లు ఉండే వడకట్టేయాలి. ఇప్పుడు కుండను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మారినేషన్ చేసిన చికెన్ ను వేయాలి.
చికెన్ దాదాపు 80 శాతం ఉడికేశాక, ముందుగా వండి పెట్టుకున్న బిర్యానీ రైస్ ను చికెన్ పై వేసుకోవాలి. పైన కాస్త నెయ్యి వేసి, కొత్తిమీర చల్లి, వేయించిన ఉల్లిపాయలను చల్లి మూత పెట్టేయాలి. గాలి పోకుండా పైన బరువు పెట్టాలి. మంట మాత్రం చాలా చిన్నగా పెట్టుకోవాలి. అలా చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికిస్తే చాలు బిర్యానీ రెడీ.