Site icon HashtagU Telugu

Kubali Rice: ఎంతో టేస్టీగా ఉండే కుబాలి రైస్.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 17 Dec 2023 08 37 Pm 3117

Mixcollage 17 Dec 2023 08 37 Pm 3117

కుబాలి రైస్ పేరు వినడానికి కాస్త కొత్తగా వెరైటీగా ఉంది కదూ. అయితే ఎప్పుడైనా మరి రెసిపీని మీరు ట్రై చేశారా. ఒకవేళ ఈ రెసిపీని మీరు ఎప్పుడూ తినకపోతే సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కుబాలి రైస్ కు కావలిసిన పదార్థాలు :

బియ్యం – అర కేజీ
శెనగపప్పు – రెండు కప్పులు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
అల్లంవెల్లుల్లి ముద్ద – రెండు స్పూన్లు
గరంమసాలా – కొద్దిగా
పుదీన – రెండు కట్టలు
నిమ్మకాయ – ఒకటి
నెయ్యి – చిన్న కప్పు
మిటాయిరంగు – చిటికెడు
పెరుగు – రెండు కప్పులు
పసుపు – తగినంత
ఉప్పు – తగినంత
కారం – తగినంత
నూనె – తగినంత

కుబాలి రైస్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా బియ్యం కడిగి నానబెట్టాలి. అలాగే శెనగపప్పును కూడా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఉడకపెట్టాలి. తర్వాత గ్యాస్ పై ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించి, అవి ఎర్రగా వేగిన తరువాత కారం, పసుపు, గరంమసాలా, ఉడికించిన శెనగపప్పును కూడా కలిపి కాసేపు స్టౌ మీద ఉంచి దింపాలి. ఈ మిశ్రమంలో పెరుగు, పుదీన ఉప్పును కూడా చేర్చి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో ఎసరుపెట్టి, నానబెట్టిన బియ్యాన్ని ఎసరులో పోసి కొద్దిగా ఉడకగానే అన్నాన్ని వార్చేసి, అదే గిన్నెలో కాస్తా నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత సగం అన్నాన్ని ఒక పొరగా వేసి, దానిపై శెనగపప్పు కూరను వేసి దానిపై మిగిలిన అన్నాన్ని మరో పొరలా వేసి ఆ పైన నెయ్యిను వెయ్యాలి. చివరిగా నిమ్మరసం చిటికెడు మిఠాయి రంగును అన్నం పై చల్లి ముతపెట్టి పదిహేను నిమిషాలు పాటు ఉడికించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కుబాలి రైస్ రెడీ.