Site icon HashtagU Telugu

Kothimeera Rice: ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 18 Dec 2023 03 02 Pm 9596

Mixcollage 18 Dec 2023 03 02 Pm 9596

కొత్తిమీర ఉపయోగించి మనం ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాం. కొత్తిమీరను వంటలో వేయడం వల్ల రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే ఎక్కువగా కొత్తిమీరను కూరలు అన్ని అయిపోయాక పైన చెల్లి దింపేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా కొత్తిమీరతోనే రైస్ చేసుకొని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఆ రెసిపీని ఇలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరి అందుకోసం కావలసిన పదార్థాలు తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొత్తిమీర రైస్ కి కావలసిన పదార్థాలు

కొత్తిమీర – నాలుగు కట్టలు
టమాటాలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
సాజీరా – ఒక స్పూన్
వండిన అన్నం – పెద్ద కప్పు
నూనె – తగినంత
ఉప్పు – తగినంత
పసుపు – తగినంత
నెయ్యి – తగినంత
వేయించిన జీడిపప్పు – 10

కొత్తిమీర రైస్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా అన్నాన్ని పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో రెండు స్పూన్ ల్ నూనె వేసి టమాటా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి వేయించాలి. మూత పెట్టకుండా ఉంచితే నీరు పట్టదు పొడిపొడిగా వస్తుంది. మగ్గిన కొత్తిమీర, టమాటా మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మూకుడులో నాలుగు స్పూన్ ల నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సాజీరా, వెల్లుల్లి వేసి, సాజీరా కాస్త వేగగానే కొత్తిమీర మిశ్రమాన్ని వేసి వేయించాలి. కొంచెం తడి పోగానే ఉడికించిన అన్నం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి. దాని మీద వేయించిన జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ.