Site icon HashtagU Telugu

Kobbari Burelu: సంక్రాంతి వంటలు.. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బ‌రి బూరెలు సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 09 Jan 2024 07 23 Pm 3634

Mixcollage 09 Jan 2024 07 23 Pm 3634

సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఇంటికి అల్లుళ్ళు కూతుర్లను పిలుచుకొని సంక్రాంతి పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి ఎక్కువగా పిండి వంటలు. ఇంటిల్లిపాది ఒక చోట చేరి సంతోషంగా మాట్లాడుకుంటూ సరదాగా పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. అలా సంక్రాంతి పిండి వంటల్లో ఒకటైన కొబ్బరి బూరెలను ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి బూరెలకు కావలసిన పదార్థాలు

బియ్య‌ప్పిండి- అర కేజీ
బెల్లం – 300 గ్రా
ప‌చ్చికొబ్బ‌రి – ఒక చిప్ప
ఏల‌కుల పొడి- ఒక టీస్పూన్‌
నూనె – సరిపడా

కొబ్బరి బూరెలు తయారీ విధానం

ఇందుకోసం ముందుగా బియ్యాన్ని ముందు రోజు నాన‌బెట్టి ఉద‌యం పిండిని సిద్ధం చేసుకోవాలి. ప‌చ్చి కొబ్బ‌రి తురిమి ప‌క్క‌న పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని పాకం ప‌ట్టి కొబ్బ‌రి తురుము, ఏల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. కొబ్బ‌రి స‌మంగా క‌లిసిన త‌ర్వాత బియ్య‌ప్పిండి వేసి క‌ల‌పాలి. బియ్య‌ప్పిండి ఉండ‌లు క‌ట్ట‌కుండా స‌మంగా క‌లిసేలా క‌ల‌పాలి. ఆపై బాణ‌లిలో నూనె పోసి కాగిన త‌ర్వాత బూరెల పిండిని చిన్న గోళీ అంత తీసుకుని అర‌చేతిలో కానీ పాలిథిన్ పేప‌ర్ మీద కాని వేసి వేళ్ల‌తో వ‌త్తి నూనెలో వేయాలి. రెండు వైపులా కాలిన త‌ర్వాత తీసేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సంక్రాంతి కొబ్బరి బూరెలు రెడీ.