Coconut Milk Benefits For Hair: కొబ్బరి పాలతో ఒత్తైన జుట్టు సొంతం చేసుకోండిలా?

స్త్రీలు చాలామంది ఒత్తయినా పొడవాటి జుట్టు కోసం ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ సరైన ఫలితం లే

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 08:30 PM IST

స్త్రీలు చాలామంది ఒత్తయినా పొడవాటి జుట్టు కోసం ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ సరైన ఫలితం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఒత్తైనా చుట్టు రావాలని మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య మరింత పెరుగుతూ ఉంటుంది. కేవలం హెయిర్ ఫాల్ సమస్య మాత్రమే కాకుండా చాలామంది అనేక రకాల కారణాల వల్ల జుట్టు నెరిసిపోవడం, పల్చగా అవ్వడం, డ్రైగా మారడం, చుండ్రు, జుట్టు జిడ్డుగా అవ్వడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే అలా జుట్టు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు కొబ్బరిపాలు ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

జుట్టును సంరక్షించుకోవడానికి కొబ్బరి పాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరిపాలలో విటమిన్ ఎ, సి, ఇ క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, సహజ ప్రొటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పాలు జుట్టు పొడవుగా, స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి పాలు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకుని వేడి చేసి, గోరువెచ్చగా అయిన తర్వాత మాడుకు, జుట్టుకు పట్టించి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్తో జుట్టును కవర్ చేయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు మెత్తని పట్టు కుచ్చులా అవుతుంది. జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ అవుతాయి.

హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది.కొబ్బరి పాలు, పెరుగు, కర్పూరం ఈ మూడు ఒక గిన్నెలో తీసుకుని మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కదుళ్ల నుంచి, చివర్ల వరకు అప్లై చేయాలి. దీన్ని ఒక గంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జుట్టు మెరిసేలా చేస్తాయి. హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తాయి. కర్పూరం చుండ్రు, పేను, దురద వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే మరో రెమిడి విషయానికొస్తే.. కొబ్బరి పాలు – 4 టేబుల్ స్పూన్ లు, ఆలివ్ నూనె – 1 టేబుల్ స్పూన్ తేనె – 1 టేబుల్ స్పూన్.. ఒక గిన్నెలో కొబ్బరి పాలు, ఆలివ్ నూనె కలిపి రెండు నిమిషాలు వేడి చేసి, ఇది గోరువెచ్చగా అయిన తర్వాత తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టును షవర్ క్యాప్తో కవర్ చేయాలి. తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలడం తగ్గి, జుట్టు మృదువుగా మారుతుంది.