beauty benefits of jaggery: బెల్లంతో మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోండిలా.?

  • Written By:
  • Updated On - February 17, 2024 / 09:03 PM IST

బెల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ బెల్లాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే వైద్యులు కూడా తరచూ బెల్లంని తీసుకోమని చెబుతూ ఉంటారు. బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్సు, విటమిన్‌ సి, బి2, ఈ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ కొంచెం బెల్లం తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అజీర్తి, మలబద్దకం, నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు, రక్తహీనత వంటి సమస్యలకు బెల్లం చెక్‌ పెడుతుంది. అయితే ఈ బెల్లం కేవలం మన ఆరోగ్య సంరక్షణకే కాదు.

చర్మం, జుట్టును సంరక్షించుకోవడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు రాకుండా రక్షిస్తుంది. డల్‌గా ఉన్న హెయిర్‌ను మెరిపిస్తుంది. బెల్లం మన డైట్‌లో చేర్చుకున్నా, హోం రెమిడీస్‌ లో వాడినా అనేక సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి బెల్లంతో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి అన్న విషయానికి వస్తే.. రోజూ కొంచెం బెల్లం తింటే అందులో ఉండే ఐరన్, క్యాల్షియం వల్ల చర్మంలోని మలినాలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి మొటిమలు ఏర్పడకుండా చేస్తాయి. అర చెంచా బెల్లం పొడిని తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను మొటిమల వల్ల ఏర్పడే బ్లాక్ హెడ్స్, మచ్చలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌, మొటిమల మచ్చలు త్వరగా మాయం అవుతాయి. బెల్లంలో సెలీనియంతో సహా శక్తివంతమైన మినరల్స్‌ ఉంటాయి. దీనిలో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు ఉన్నాయి. నవ్వుల నూనెలో కొంచెం బెల్లం పొడి, కాస్త అలోవెరా జెల్‌ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ ముఖానికి అప్లై చేసుకోండి. ఆరిన తర్వతా ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే చర్మంపై ముడతలు, ఫైన్‌ లైన్స్‌ తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. బెల్లంలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. గ్లైకోలిక్ యాసిడ్‌ను బ్యూటీ ప్రొడెక్స్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. రెండు స్పూన్ల బెల్లం పొడి తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. బెల్లం మన చర్మంలోని మలినాలను తొలగిస్తుంది, చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌తో ముఖానికి సరికొత్త గ్లో వస్తుంది. అలాగే బెల్లంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇది న్యాచురల్‌ క్లెన్సర్‌లా పని చేస్తుంది. చర్మం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు తేలికపాటి డిటాక్స్‌గా పనిచేస్తాయి. ప్రీ-రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగిస్తాయి. చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది తలకు కూడా రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్‌ చేస్తుంది. మన డైట్‌లో బెల్లం తరచుగా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు ఫాస్ట్‌గా పెరుగుతుంది, బెల్లం జుట్టుకు మంచి మెరుపును కూడా ఇస్తుంది.