Lemon for skin: నిమ్మరసంలో అది కలిపి రాస్తే చాలు మీ ముఖం ప్రశాంతంగా వెలిగిపోవాల్సిందే?

మామూలుగా స్త్రీలు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముఖం డల్ గా అయిపోవడం మొటిమలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మ

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 09:15 PM IST

మామూలుగా స్త్రీలు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముఖం డల్ గా అయిపోవడం మొటిమలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో కాస్త ఎండకు అలా వెళ్లి వస్తే చాలు ముఖమంతా డల్ గా అయిపోతూ ఉంటుంది. అలాగే చలికాలంలో కూడా ముఖమంతా పగిలిపోయి అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అటువంటి అప్పుడు ఏం చేయాలి? ముఖం ఎప్పటిలాగే ప్రకాశవంతంగా వెలిగిపోవాలంటే ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం… అందాన్ని మరింత పెంచడంలో నిమ్మకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటిన్‌, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మినరల్స్‌, విటమిన్‌ సీ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

రోజూ నిమ్మరసం తాగితే అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. నిమ్మకాయలో సమృద్ధిగా ఉండే విటమిన్‌ సీ శరీర కణజాలం పెరుగుదల, అభివృద్ధి, మరమ్మత్తుకు సహయపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికే కాదు చర్మ, కేశ సంరక్షణకు సహాయపడతాయి. మ్మలో ఉండే విటమిన్‌ సి, సిట్రిక్‌ యాసిడ్‌ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి, చర్మాన్ని తెల్లగా మారుస్తాయి. అయితే మీరు యవ్వనంగా కనిపించాలంటే.. చెంచా కొబ్బరి నూనెకు, రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి ముఖానికి మసాజ్‌ చేయాలి. పది నిమిషాలు తరవాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసంలోని విటమిన్‌ సి మృత కణాల్ని తొలగించి, ఆరోగ్యవంతమైన చర్మ కణాలు ఎదిగేలా సహాయపడుతుంది.

అలాగే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే వేసవిలో జుడ్డు చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక జిడ్డు చర్మతత్వం ఉన్నవారు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. జిడ్డు కారణంగా మొటిమలు, మచ్చలు వేధిస్తూ ఉంటాయి. జుట్టు సమస్యకు చెక్‌ పెట్టడానికి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి దూదితో ముఖానికి రాసుకోవాలి. అది ఆరిన తర్వాత శుభ్రమైన నీళ్లతో ముఖాన్ని క్లీన్‌ చేసుకోవాలి. చర్మంలో సహజంగా ఉత్పత్తయ్యే నూనె స్థాయులను క్రమబద్ధీకరించడానికి నిమ్మరసం సహాయపడుతుంది. కొందరి మోచేతులు, మోకీళ్లు నల్లగా మారుతాయి.

ఈ సమస్యకను పరిష్కరించడానికి నిమ్మ సహాయపడుతుంది. నిమ్మ చెక్కతో ఐదు నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతాల్లో రుద్దండి. ఇలా రోజూ చేస్తే కొన్ని రోజుల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. రెండు చెంచాల నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూన్‌, చెంచా సముద్రపు ఉప్పులను బాగా కలిపి మాడుకు బాగా పట్టించాలి. పది నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. నిమ్మలోని గుణాలు జుట్టు కదుళ్ల వద్ద రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఆలివ్‌ నూనె జుట్టుకు, చర్మానికి అవసరమైన తేమను ఇస్తే, సముద్రపు ఉప్పు చర్మం మీది మృతకణాల్ని తొలగిస్తుంది. దీంతో జట్టు రాలడం తగ్గి, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇలా చేస్తే చండ్రు సమస్య కూడా పరిష్కారం అవుతుంది.