రోజ్ వాటర్ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో రోజ్ వాటర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. రోజ్ వాటర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. అయితే రోజ్ వాటర్‌తో మీ అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లాప్టాప్ కంప్యూటర్ ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలామంది డాల్ సర్కిల్ సమస్యతో బాధపడుతున్నారు.
అటువంటి వారు కొద్దిగా రోజ్‌వాటర్‌ని తీసుకొని అందులో కాటన్‌ను ముంచి కళ్ల కింద రాయాలి. ఇలా కనీసం రెండు రోజులకోసారి చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తే కళ్లు బరువెక్కడం, నొప్పి, మంట వంటి సమస్యలు దూరం అవుతాయి. రోజ్ వాటర్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎండలో వెళ్లేముందు ముఖంపై రోజ్ వాటర్ అప్లై చేసుకుంటే మంచిది. రోజూ ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేస్తే చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖ చర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకుని చర్మం తాజాగా కనిపిస్తుంది. రోజ్ వాటర్ క్లెన్సర్‌గా పని చేస్తుంది. రోజ్‌వాటర్ మన ముఖంపై ఉన్న జిడ్డుని, పేరుకుపోయిన మురికిని తీసేసి చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుతాయి.
ఇందులో ఉన్న సహజసిద్ధమైన నూనెలు మన చర్మంలో ఉన్న తేమను పోనీయకుండా కాపాడతాయి. స్నానం చేసే నీటిలో కాస్తంత రోజ్‌వాటర్ వేస్తే చర్మం మెరుస్తుంది. రోజుకి ఒకసారైనా గులాబీ నీళ్లల్లో ముంచిన దూదితో ముఖాన్ని తుడిస్తే మంచిది. ఇది యాస్ట్రింజెంట్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలూ కూడా ఇందులో ఉండటం వల్ల ముడతలూ, వలయాలూ అదుపులో ఉంటాయి. పావు కప్పు గులాబీ నీళ్లల్లో కొద్దిగా తేనె కలిపి.. మునివేళ్లతో ముఖానికి రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మెరిసిపోతుంది.