Site icon HashtagU Telugu

Milk Powder: పాలపొడితో ఈ విధంగా చేస్తే చాలు మీ అందం మెరిసిపోవడం ఖాయం?

Mixcollage 16 Feb 2024 08 03 Pm 2327

Mixcollage 16 Feb 2024 08 03 Pm 2327

ఇదివరకటి రోజుల్లో పాలకు బదులుగా ఎక్కువగా పాలపొడిని ఉపయోగించేవారు. కానీ రాను రాను పాలపొడి వినియోగం పూర్తిగా తగ్గిపోవడంతో అవి కనుమరుది అయిపోయాయి. కానీ ఇప్పటికీ అక్కడక్కడ ఈ పాలపొడులు కనిపిస్తూ ఉంటాయి. అయితే పాలపొడి కేవలం ఇన్స్టాంట్ గా పాలు రెడీ చేయడం కోసమే మాత్రమే కాకుండా అందాన్ని సంరక్షించుకోవడానికి అందాన్ని పెంచడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పాల పొడిలోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని మృదువుగా మార్చి కాంతి వంతంగా చేస్తుంది. పాల పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్‌ ఎక్స్‌ఫోలియేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలపొడిలోని విటమిన్‌ డి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

పాల పొడి కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది క్లెన్సర్‌లా పనిచేసి చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. చర్మానికి తేమను అందించి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. మరి ఈ పాల పొడిని ఉపయోగించి అందాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిగ్మెంటేషన్‌ సమస్యతో బాధపడే వారు చెంచా చొప్పున పాలపొడి, శనగపిండి, నారింజ రసాన్ని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా తరచుగా చేస్తే ఎండ కారణంగా కమిలిన చర్మం తాజాగా మారుతుంది. రెండు చెంచాల పెరుగు, చెంచా పాలపొడి, అరచెంచా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి.

దీన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పిగ్మెంటేషన్‌ మచ్చలు దూరం అవుతాయి. టొమాటో పేస్ట్‌లో పావుచెంచా పసుపు, స్పూన్‌ పెరుగు, ఒక స్పూన్‌ పాలపొడి వేసి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. మొటిమలతో బాధపడేవారు స్పూన్‌ పసుపు, తేనె, రెండు స్పూన్ల పాలపొడి వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల సమస్య దూరం అవుతుంది. అలాగే వేసవికాలం.ం చాలామంది జిడ్డు చర్మంతో బాధపడుతుంటారు. జిడ్డు దూరమై, ముఖం తాజాగా మారాలంటే.. స్పూన్‌ ముల్తానీ మట్టి, రెండు స్పూన్ల పాల పొడి, తగినంత గులాబీ నీటిని కలిపి పేస్టులా చేసి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.