Beauty Tips: మామిడిపండుతో మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండిలా?

మామూలుగా మనకు ఏడాది పొడవునా అక్కడక్కడా మామిడికాయలు కనిపించినప్పటికీ ఎక్కువగా వేసవికాలంలోనే ఈ మామిడి కాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 01:28 PM IST

మామూలుగా మనకు ఏడాది పొడవునా అక్కడక్కడా మామిడికాయలు కనిపించినప్పటికీ ఎక్కువగా వేసవికాలంలోనే ఈ మామిడి కాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మామిడికాయలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ మామిడికాయలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మామిడికాయను ఉపయోగించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండులోని విటమిన్‌ ఏ, సి, కాపర్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి.

కొల్లాజెన్‌ ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మామిడిలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, పొడి బారకుండా చూసుకుంటుంది. మామిడి పండు గుజ్జును చర్మానికి అప్లై చేయడం వల్ల మృదువుగా, కోమలంగా ఉంటుంది. మూడు చెంచాల మామిడిపండు గుజ్జుకు చెంచా ఓట్స్‌, రెండు చెంచాల పాలు, నానబెట్టి మెత్తగా చేసిన నాలుగు బాదంపప్పుల ముద్ద కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి, 15 నిమిషాల పాటు ఆరనిచ్చి,ఆ తర్వాత సున్నితంగా రుద్ది, గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మామిడి గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్లు, AHA, విటమిన్‌ A ఉంటాయి.

ఇవి చర్మం రంధ్రాల లోపలి నుంచి మురికిని, నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను నెమ్మది చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫ్రీ రాడికల్స్ చర్మ కణాలకు నష్టం చేయకుండా వాటితో పోరాడతాయి. మీ చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును ఇవ్వడానికి మామిడి పండు సహాయపడుతుంది. మామిడి గుజ్జులో సమాన పాళ్లలో ముల్తానీ మట్టిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. మామిడి పండు గుజ్జు చర్మ రంధ్రాలను క్లియర్‌ చేసి, మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ను నివారిస్తుంది. మామిడి గుజ్జులోని బీటా కెరోటిన్‌ చర్మ సమస్యలు రాకుండా రక్షిస్తుంది. మామిడికి న్యాచురల్‌ అస్ట్రింజెంట్‌, క్లెన్సింగ్‌ గుణాలు ఉన్నాయి. మామిడిపండు గుజ్జుకు చెంచా గోధుమపిండి, రెండు చెంచాల తేనె కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. తడిపొడిగా ఉన్నప్పుడు మునివేళ్లను నీటితో తడి చేసుకొని ముఖాన్ని మృదువుగా మసాజ్‌ చేసి పావుగంట తర్వాత శుభ్రం చేస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ సమస్యకు చెక్‌ పడుతుంది.