Site icon HashtagU Telugu

Capsicum Beauty Benefits:​ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే క్యాప్సికంతో ఇలా చేయాల్సిందే?

Mixcollage 04 Dec 2023 05 09 Pm 7167

Mixcollage 04 Dec 2023 05 09 Pm 7167

మన వంటింట్లో దొరికే కాయగూరల్లో క్యాప్సికం కూడా ఒకటి. ఈ క్యాప్సికం ఉపయోగించి రకరకాల రెసిపీలను ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ క్యాప్సికం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే క్యాప్సికం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.. క్యాప్సికం అందానికి ఉపయోగపడటం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా. మీరు విన్నది నిజమే.. మరి క్యాప్సికంని చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ​క్యాప్సికంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది.

గ్రీన్‌, రెడ్‌, ఎల్లో ఏ వెరైటీ క్యాప్సికంలోనైనా.. విటమిన్‌ సి మెండుగా ఉంటుంది. విటమిన్‌ సి చర్మ నిర్మాణం, స్థితిస్థాపకత ఇవ్వడానికి బాధ్యత వహించే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. కొల్లాజెన్‌ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి తోడ్పడుతుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి విటమిన్‌ సి అవసరం. క్యాప్సికం చర్మానికి తేమనందించడానికి సహాయపడుతుంది. క్యాప్సికంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిలో 92 శాతం వరకు నీరు ఉంటుంది. క్యాప్సికం మీ చర్మానికి లోపలి నుంచి పోషణ అందించి తేమగా, మృదువుగా ఉంచుతుంది. క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాలు, కాలుష్యం, ఫ్రీ రాడికల్స్‌ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి చర్మం ఆకృతిని, రూపాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. క్యాప్సికంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఫ్రీరాడికల్స్‌ వల్ల చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. చర్మం పొడిబారడం, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తాయి.