ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది మాత్రమే హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉన్నారు. అయినప్పటికీ ఫలితాలు కనిపించకపోవడంతో బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన అందాన్ని పెంచడంలో వంటింట్లో దొరికి కొన్ని పదార్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. వాటిలో బ్రౌన్ షుగర్ కూడా ఒకటి. మీ అందాన్ని సంరక్షించడంలో బ్రౌన్ షుగర్ ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్రౌన్ షుగర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది.
ఇందులోని గ్లైకోలిక్ యాసిడ్, అల్పా హైడ్రాక్సీ యాసిడ్ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి డెడ్ సెల్స్‌ను క్లియర్ చేస్తాయి. కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. బ్రౌన్ షుగర్ డెడ్ సెల్స్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తేనె, బ్రౌన్ షుగర్‌ను సమాన పరిమాణంలో తీసుకుని మిక్స్ చేసి దీనిలో లావెండర్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పంచదార కరిగే వరకు మసాజ్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా బ్రౌన్ షుగర్ సహజ హ్యూమెక్టెంట్. ఇది పర్యావరణం నుంచి తేమను ఆకర్షించి, చర్మానికి బదిలీ చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్‌గా ఉంచే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
బ్రౌన్ షుగర్ సున్నితంగా ఉంటుంది, సాధారణ చక్కెర కంటే మృదువుగా ఉంటుంది. ముఖానికి తేమను అందించడానికి, కొబ్బరి నూనెలో బ్రౌన్ షుగర్ కలపాలి. దానిలో లావెండర్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి మసాజ్ చేసి ఆరాక గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసువాలి. ఇలా చేస్తే డెడ్ సెల్స్ పోయి చర్మం మృదువుగా తయారవుతుంది. బ్రౌన్ షుగర్ చర్మంపై ఉన్న మృత కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా చేస్తుంది. చర్మానికి ప్రకాశవంతమైన కాంతిని ఇస్తుంది. చర్మంపై ఉన్న టాన్‌ను తొలగించి మెరుపునిస్తుంది. టొమాటో ముక్కకు బ్రౌన్‌షుగర్‌ని అద్ది రుద్దుకోవాలి. ఇలా రెండు మూడు నిమిషాలు సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా చేస్తే చాలు. నీటితో శుభ్రం చేసుకుని చూస్తే టాన్ తగ్గి చర్మం మెరుస్తుంది.