Site icon HashtagU Telugu

Tips To Remove Dandruff: డ్యాండ్రఫ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే?

Tips To Remove Dandruff

Tips To Remove Dandruff

కాలంతో సంబంధం లేకుండా చాలామందిని చుండ్రు సమస్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ చుండ్రు కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.. తలలో విపరీతమైన దురద, తల, భుజాలపై డ్యాండ్రఫ్‌ కనిపిస్తూ చికాకు తెప్పిస్తుంది. తలమీద చర్మం పొడిబారడం, దానికి సూక్ష్మక్రిములు తోడవడం వల్ల ఈ కాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, జుట్టు పూర్తిగా ఆరకముందే జడవేసుకోవడం వంటి కారణాల వల్ల కూడా డ్యాండ్రఫ్‌ వచ్చే అవకాశం ఉంది. చుండ్రును తగ్గించుకోవడం కోసం చాలామంది అనేక రకాల షాంపూలు బ్యూటీ ప్రోడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.

వాటితో పాటుగా ఇంట్లో ఉండే కొన్ని రకాల వాటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు..కొబ్బరి నూనె, నిమ్మరసం సమాన పరిమాణంలో తీసుకుని తలకు అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే డ్యాండ్రఫ్‌ మాయం అవుతంది. నిమ్మరసం, ఎగ్‌ వైట్‌ , ఉల్లిరసం సమపాళ్లలో తీసుకుని, ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు రాయాలి. కాసేపు మర్దన చేశాక తలస్నానం చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. గిన్నెలో కప్పు కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి. దీనికి పావు కప్పు వేపనూనె కలపాలి. దీన్ని రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని మరుసటి రోజు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు దూరం అవుతుంది. రాత్రంతా నానబెట్టిన మెంతులకు కొన్ని వేపాకులు వేసి మిక్సీ పట్టుకోండి. ఈ పేస్టే కొద్దిగా పెరుగు కలుపుకోండి. ఈ పేస్ట్‌ను తలకు ప్యాక్‌లా వేసుకోవాలి.

గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య దూరం అవుతుంది. గుప్పెడు వేపాకులను తీసుకొని పదినిమిషాల పాటు నీటిలో ఉంచాలి. ఆ తర్వాత వాటిని మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. దీనికి కాస్త కలబంద గుజ్జుని యాడ్‌ చేసి పేస్ట్‌లా చేసుకోండి. దీన్ని తలకు అప్త్లె చేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. మంచి ఫలితం కనిపిస్తుంది. శీతాకాలంలో కుదుళ్లు పొడిబారడం వల్ల చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి కలబంద ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కలబంద గుజ్జులో వేపాకుల పొడిని కలపాలి. దీనికి కొన్ని చుక్కల ఉసిరి నూనె యాడ్‌ చేసి మిక్స్‌ చేసుకోండి. ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి ఆరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ సమస్య దూరం అవుతుంది. అలాగే జుట్టుకు మందార ఆకులు, పువ్వులు కండిషనర్‌‌లా పనిచేస్తాయి. మందార ఆకులు పువ్వులు పేస్ట్‌లా చేసి తలకు ప్యాక్‌లా అప్లై చేయాలి. ఈ ప్యాక్‌తో జుట్టు ముదురు రంగులోకి మారుతుంది. చండ్రు సమస్య కూడా దూరం అవుతుంది.