Site icon HashtagU Telugu

Lunch Box : పిల్లల లంచ్ బాక్సులో ఏమేం ఉండాలంటే?

Kids Box

Kids Box

వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో తిరిగి స్కూళ్లు (Schools Open) ప్రారంభమయ్యాయి. స్కూల్‌కి వెళ్లే చిన్నారుల ఆరోగ్యం (Children’s Health) పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన సమయం ఇది. పిల్లల లంచ్ బాక్స్(Lunch Box) అనేది నిత్యం వారికిచ్చే శక్తికి మూలాధారం కావడంతో, పోషకాహారంతో నిండిన పదార్థాల్ని అందించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య నిపుణులు చిన్నారుల వృద్ధి, బలానికి తగిన విధంగా లంచ్‌ బాక్స్‌ను ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.

Shubman Gill: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్‌పై ట్రోల్స్‌.. బ్యాట్‌పై “ప్రిన్స్” అని ఉండ‌ట‌మే కార‌ణమా?

లంచ్ బాక్స్‌లో పిల్లల శరీర అభివృద్ధికి అవసరమైన ప్రొటీన్లు కలిగిన ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. ఉదాహరణకు గుడ్డు, మాంసం, పప్పులు, పనీర్ వంటి వాటిని రోజూ ఒకటి అయినా చేర్చాలి. అలాగే విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే తాజా పండ్లు (బనానా, ఆపిల్, అరటి), కూరగాయలతో తయారైన పొరల కూరలు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి హోల్గ్రెయిన్స్ కూడా పిల్లలకు తగిన శక్తిని అందిస్తాయి.

Gaddar : రేపే గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం..ఆహ్వాన పత్రికపై గద్దర్ ఫొటో లేకపోవడం బాధాకరం

పిల్లలు కొన్నిసార్లు తినటానికి మారం చేస్తారు. అయితే తల్లిదండ్రులు ఓపికగా, సృజనాత్మకంగా లంచ్ బాక్స్‌లో ఆరోగ్యకరమైనవి చేర్చాలి. పాల ఉత్పత్తులు వంటి వాటిని ఖచ్చితంగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణ చీజ్, కర్డ్, మిల్క్ శేక్‌లు. ఇవి క్యాల్షియం కోసం ముఖ్యం. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, సీడ్స్ (చియా, ఫ్లాక్స్), నట్స్ (బాదం, వాల్‌నట్) కూడా చిన్న పరిమాణాల్లో చేర్చడం ద్వారా శక్తి మరియు మెదడు వికాసానికి తోడ్పడతాయి. మొత్తంగా లంచ్ బాక్స్ వాయిదా వేయకుండా ఆరోగ్యంతో నిండి ఉండేలా జాగ్రత్త పడాలి.