Site icon HashtagU Telugu

Aravana Payasam: ఎంతో టేస్టీగా ఉండే అరవణి ప్రసాదం ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

Aravana Payasam

Aravana Payasam

అరవణి ప్రసాదం.. దీనినే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అంటుంటారు. ఈ పేరు వింటే చాలామందికి నోరు ఊరిపోతూ ఉంటుంది. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో చాలామంది అయ్యప్ప మాల ధరించి శబరిమల కు వెళ్లి అక్కడి నుంచి అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటారు. ఈ ప్రసాదం ఇష్టపడని వారు దాదాపుగా ఉండరేమో. మరి కొంతమంది డబ్బాలకు డబ్బాలు లాగించేస్తూ ఉంటారు. అయితే ప్రసాదం చాలా ఇష్టం ఉన్నప్పటికీ కేవలం ఆ ప్రసాదం కొంత మాత్రమే తీసుకుంటూ ఉండాలి. మరి ఈ ప్రసాదాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

ఎర్రబియ్యం – ఒక కప్పు
నల్ల బెల్లం – రెండు కప్పులు
నెయ్యి – తగినంత
జీడిపప్పులు – 2 టీ స్పూన్​ లు
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు
శొంఠి పొడి – 2 టీస్పూన్లు
నీళ్లు – 6 కప్పులు

అరవణి ప్రసాదం తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా నల్ల బెల్లాన్ని మొత్తగా తురిమి దానిని ఒక పాత్రలో వేసుకుని కరిగించాలి. మరో పాత్రలో నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి, జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎర్రబియ్యాన్ని అన్నంలా వండుకోవాలి. ఇలా రైస్ ఉడికించే సమయంలోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆపై అన్నం మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో కరిగించుకున్న నల్ల బెల్లం పాకాన్ని వేయాలి. తర్వాత కొంచెం శొంఠి పొడిని కలిపి నెయ్యి వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న సమయంలో బబుల్స్ వస్తుంటే స్టౌ ఆఫ్ చేసి దానిలో వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే కేరళ శబరిమల అరవణ ప్రసాదం రెడీ.

Exit mobile version