టాలీవుడ్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. కాగా ఇటీవలే సర్కారీ వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కీర్తి సురేష్. ఈ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈమె సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ పలు ఫోటోలను షేర్ చేయక ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
కాగా కీర్తి సురేష్ తరచుగా మేకప్ లేని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కాగా కీర్తి సురేష్ అందాల ఆరబోతకు కాస్త దూరంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నటించిన దసరా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ప్రొడక్షన్ హౌస్ పై సుధాకర్ చెరుకూరి సమర్పణలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పింది. కళ్ళ కింద నల్లని మచ్చలు పోవడానికి బ్యూటీ టిప్స్ ను చెప్పింది. కళ్ళ కింద డీపఫ్స్ పెట్టుకోవడం వల్ల గ్లో వస్తుందని, మేకప్ వేసుకోకపోయినప్పటికీ ఫేస్ లో గ్లో వస్తుంది అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ హ్యాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.