Kriti Sanon: కృతి సనన్‌లా మీ స్కిన్ మెరవాలని ఉందా?…అందాల కృతి పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!!

బాలీవుడ్ నటి కృతి సనన్ అందానికి చాలా మంది పిదా అవుతారు. కృతికి నటనతోనే కాదు తన అందంతోనూ అందరినీ అలరిస్తుంది.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 07:00 AM IST

బాలీవుడ్ నటి కృతి సనన్ అందానికి చాలా మంది పిదా అవుతారు. కృతికి నటనతోనే కాదు తన అందంతోనూ అందరినీ అలరిస్తుంది. ఆమె ఫ్లా లెస్ స్కిన్ అంటే అమ్మాయిలు పడి చస్తుంటారు. కృతి స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. మేకప్ లేకుండా కూడా కృతి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. కృతి తన చర్మాన్ని సహజమైన రీతిలో ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. కృతి సనన్ టాప్ 5 బ్యూటీ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. వీటిని అనుసరించడం ద్వారా మీరు కూడా అందంగా కనిపించవచ్చు.

మంచి సన్‌స్క్రీన్ లోషన్ అవసరం
కృతి ఎప్పుడూ మంచి సన్‌స్క్రీన్ లోషన్‌ని తన బ్యాగ్‌లో ఉంచుకుంటుంది. ఇంటి నుండి బయలుదేరే ముందు అప్లై చేస్తుంది. ఇది టానింగ్‌ను నివారిస్తుంది. సూర్యరశ్మి ఉన్నప్పుడే వాడాలి అనేది పూర్తిగా అవాస్తవం అని, బయట వాతావారణం ఎలా ఉన్నా, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించాలని సూచించింది.అయితే మంచి కంపెనీ సన్ స్క్రీన్ వాడాలని తెలిపింది.

రాత్రి పడుకునే ఫేస్ వాష్
రాత్రి పడుకునే ముందు మేకప్ తప్పనిసరిగా తొలగించాలని కృతి తెలిపారు. ఇది చర్మానికి చాలా ముఖ్యం. చాలా సార్లు కొంతమంది సోమరితనం కారణంగా మేకప్‌ను తొలగించరు, కానీ ఇది స్కిన్ ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుంది. దీనితో పాటు మచ్చలు ముఖంపై కనిపించడం ప్రారంభించవచ్చు. తేలికపాటి క్లెన్సర్ సహాయంతో ముఖం నుండి మేకప్ తొలగించుకోండి. ఆ తర్వాత ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

మాయిశ్చరైజర్ గురించి మర్చిపోవద్దు
ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడిగిన తర్వాత మాయిశ్చరైజ్ చేయడం చాలా ముఖ్యం. చర్మంపై మంచి కంపెనీకి చెందిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలని తెలిపింది.

నీరు బాగా తాగండి..
చర్మాన్ని సంరక్షించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు పుష్కలంగా నీరు త్రాగడం కూడా ముఖ్యమని కృతి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, చర్మం మెరుస్తూ మరియు డిటాక్సిఫైయింగ్ చేయడానికి నీటితో పాటు పండ్లను ఎక్కువగా తినడం అవసరం.

సహజమైన ఫేస్ ప్యాక్ ఉపయోగించండి
కృతి తన ముఖాన్ని తాజాగా ఉంచుకోవడానికి సహజమైన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తుంది. ఆమె ముఖానికి అలోవెరా జెల్, శెనగపిండి, పసుపు, నిమ్మ తేనెను ఉపయోగిస్తుంది. వీటిని వాడటం వల్ల ముఖం మెరిసిపోతుంది.