Katrina Kaif : కత్రీనాకైఫ్ అంత అందంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? కత్రినా బ్యూటీ సీక్రెట్స్..

కత్రినా కైఫ్ 39 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ తన అందంతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. మరి 39 ఏళ్ళు వచ్చినా ఇంకా అంత యంగ్ గా కనపడటానికి కత్రినా రోజూ ఏం చేస్తుందో తెలుసా??

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 08:11 PM IST

హీరోయిన్స్ ఎప్పుడు చూసినా అందంగానే కనిపిస్తారు. ఇక సినిమాల్లో మేకప్ తో మరింత అందంగా కనిపిస్తారు. ఏజ్ పెరిగినా కూడా చాలా మంది హీరోయిన్స్ అసలు ఏజ్ పెరిగినట్టు కూడా అనిపించారు. తాజాగా బాలీవుడ్(Bollywood) భామ కత్రినా కైఫ్(Katrina Kaif) తన బ్యూటీ సీక్రెట్స్ ని మీడియాతో పంచుకుంది. కత్రినా కైఫ్ 39 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ తన అందంతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. మరి 39 ఏళ్ళు వచ్చినా ఇంకా అంత యంగ్ గా కనపడటానికి కత్రినా రోజూ ఏం చేస్తుందో తెలుసా??

తాజాగా కత్రినా తన బ్యూటీ టిప్స్ గురించి మీడియాతో మాట్లాడుతూ తను రోజు వారి చేసే పనులు తెలిపింది. కత్రినా తను తీసుకునే ఫుడ్ గురించి మాట్లాడుతూ.. మనం ఉదయం లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునే వరకు మన అలవాట్లే మన అందాన్ని నిర్దేశిస్తాయి. నేను రోజూ ఉదయాన్నే రెండు గ్లాసుల గోరువెచ్చటి నీరుని తాగి నా రోజుని ప్రారంభిస్తాను. ఆ తర్వాత నా బ్రేక్ ఫాస్ట్ గా పాలకూర రసం తీసుకుంటాను. మళ్ళీ బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లి తింటాను. ఇడ్లిని పాలకూర చట్నీ, టమాటా చట్నీ లేదా సాంబార్ తో కలిపి తింటాను. మధ్యాహ్నం అన్నం, చపాతీలు, కూర లిమిటెడ్ గా తింటాను. సాయంత్రం జ్యూస్ లు, ప్రోటీన్ షేక్స్ లాంటివి తాగుతాను. రాత్రి పూట చాలా అల్పంగా ఆహరం తీసుకుంటాను అని తెలిపింది.

ఇక తన మేకప్, ఫేస్ గ్లో కోసం చేసే పనుల గురించి మాట్లాడుతూ.. నిద్ర లేచినపుడు ఫేస్ ఉబ్బినట్టు కనిపిస్తే చల్లటి ఐస్ వాటర్ లో నా ముఖం ముంచి తీస్తాను. అనంతరం ముఖానికి ఏదైనా ఫేసియల్ ఆయిల్ తో మర్దన చేస్తాను. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా ఉంటాయి. ఓట్స్, తేనే కలిపి తయారుచేసిన ఫేస్ ప్యాక్ ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటాను. ఈ ప్యాక్ వల్ల చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇక రెగ్యుయలర్ గా యోగా, వ్యాయామాలు చేస్తాను. మేకప్ వల్ల ఆరోగ్యం దెబ్బ తినే మాట నిజమే అందుకే అనేక జాగ్రత్తలు తీసుకుంటాను. మేకప్ వేసుకునేముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాస్తాను. దానివల్ల మేకప్ రసాయనాలు ముఖం లోపలికి వెళ్లకుండా ఉంటాయి. షూటింగ్ అవ్వగానే మేకప్ తీసేస్తాను. రాత్రి పూట అస్సలు మేకప్ ఉంచుకోను. బయటకి వెళ్లాల్సి వస్తే కేవలం టచప్ మాత్రమే చేసుకుంటాను అని తెలిపింది కత్రినా.

 

Also read :   Water melon : ఎండాకాలంలో దొరికే ఈ పండుతో ముఖాన్ని అందంగా మార్చేసుకోండి..