మామూలుగా పిల్లలు చాలామంది పెద్దలు కాకరకాయకు సంబంధించిన రెసిపీలను తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకు గల కారణం కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి. అయితే కాకరకాయతో కాకరకాయ ఫ్రై కాకరకాయ మసాలా కూర, కాకరకాయ కర్రీ లాంటి రెసిపీలను ట్రై చేస్తూ ఉంటారు. అయితే కాకరకాయతో ఎన్ని రెసిపీలు ట్రై చేసినా కూడా కాకరకాయ ఉల్లికారం కూర మాత్రం ఎప్పుడు చేసిన టేస్ట్ అదుర్స్ అని చెప్పవచ్చు. ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేశారంటే చిన్న పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి కాకరకాయ ఉల్లికారం కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాకరకాయ ఉల్లికారం కూర కావలసిన పదార్థాలు
కాకరకాయ – 1 /4 కేజీ
ఉల్లిపాయలు – 3
నూనె – 2 స్పూన్స్
కారం – 1 స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
కరివేపాకు – 2 రెబ్బలు
కాకరకాయ ఉల్లికారం కూర తయారీ విధానం:
ముందుగా కాకరకాయని బాగా కడిగి మధ్యకు రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఒకో ముక్కని గుత్తి కూరలకి తరిగినట్టు నాలుగు గాట్లతో గుత్తిగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి ఉప్పు రాసి బాణలిలో రెండు చెంచాల నూనె వేసి కాకరకాయలు వేసి మూతపెట్టాలి. ఉల్లిపాయని సన్నగా తరిగి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కాకరకాయ కాస్త మగ్గాకా మూత తీసి వేయాలి. బాగా వేగాకా ఉల్లిముద్ద, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక 5 నిముషాలు ఉంచి దించితే రుచికరమైన కాకరకాయ ఉల్లికారం కూర రెడీ.