Site icon HashtagU Telugu

Kaju Mushroom Masala: ఎప్పుడైన కాజూ మష్రూమ్స్ మసాలా తిన్నారా.. తయారు చేసుకోండిలా?

Kaju Mushroom Masala

Kaju Mushroom Masala

మనలో చాలామంది పుట్టగొడుగులు తినడానికి ఇష్టపడితే మరికొందరు తినడానికి అంతగా ఇష్టపడరు. కొందరు మాత్రం పుట్టగొడుగులతో ఎటువంటి వంటకం తయారుచేసిన కూడా లొట్టలు వేసుకొని మరి తింటూ ఉంటారు. మనకు ఈ మష్రూమ్స్ ఎక్కువగా వర్షాకాలంలో పొలం గట్టుల మీద కనిపిస్తూ ఉంటాయి. కానీ టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఏడాది పొడవునా మనకు ఇవి సూపర్ మార్కెట్లలో లభిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పుడైనా కాజూ మష్రూమ్స్ మసాలా కర్రీ ట్రై చేశారా. ఒకవేళ చేయకపోతే ఎలా తయారు చేసుకోవాలో,అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాజూ మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్ధాలు:

టొమాటోలు – మూడు
అల్లం – చిన్న ముక్క
నానబెట్టిన జీడిపప్పు – పావు కప్పు
పచ్చిమిర్చి – మూడు
వెల్లుల్లి – నాలుగు
యాలుకలు – రెండు
లవంగాలు – మూడు
ఎండు మిర్చి – రెండు
మిరియాలు – అర టేబుల్ స్పూన్
మీగడ పెరుగు – పావు కప్పు
నీళ్ళు – తగినన్న
నూనె – అర కప్పు
జీడిపప్పు – ముప్పావు కప్పు
మష్రూమ్స్ – 150 గ్రాములు
ఉల్లిపాయ – ఒకటి
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
కారం – అర టేబుల్ స్పూన్
గరం మసాలా – అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి – అర టేబుల్ స్పూన్
కారం – రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
నీళ్ళు – 350 ml
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నిమ్మరసం – అర టేబుల్ స్పూన్

కాజూ మష్రూమ్ మసాలా తయారీ విధానం:

ముందుగా మసాలా మిక్సీ లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనెలో జీడిపప్పు వేసి సగం వేపుకుని అందులోనే మష్రూమ్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాలి. వేగిన ఉల్లిపాయల్లో కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా వేపుకోవాలి. అవి వేగాక రెఢీగా ఉన్న పేస్టు వేసి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి అందులో, 350 ml నీళ్ళు పోసి గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నూనె తేలాక ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్ప్పు, మష్రూమ్స్ వేసి 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత నెయ్యి, కొత్తిమీర తరుగు చల్లి మరో నిమిషం ఉడకనివ్వాలి. దింపే ముందు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కాజూ మష్రూమ్స్ మసాలా రెడి.

Exit mobile version