Site icon HashtagU Telugu

Sunscreen : ఈ ఐదు ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.. సన్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పాల్సిందే..

Just Take These Five Food Items And Say Goodbye To Sun Screen.

Just Take These Five Food Items And Say Goodbye To Sun Screen.

Say Goodbye to Sunscreen : మామూలుగా వేసవికాలం, వర్షాకాలం, చలికాలం.. ఇలా ఏ సీజన్ అయినా సరే సన్‌స్క్రీన్‌ కచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే. ఎండ ప్రభావానికి చర్మం పాడవకుండా ఉండడం కోసం ఈ సన్‌స్క్రీన్‌ లోషన్ (Sunscreen Lotion) రాసుకుంటూ ఉంటారు. అయితే ఈ సన్ స్క్రీన్ (Sunscreen) కోసం చాలామంది చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇక మీదట డబ్బు ఖర్చు లేకుండానే మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా, మీ డైట్ లో ఐదు రకాల ఆహార పదార్థాలు చేర్చుకుంటే చాలు అవి సన్‌స్క్రీన్‌ లా పని చేస్తాయి. దీంతో ఖర్చుపెట్టి సన్‌స్క్రీన్‌ (Sunscreen)లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. మరి అందుకోసం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

నిమ్మరసంలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యూవీ కిరణాలను నుంచి చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. నిమ్మరసంలోని విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్‌ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. అలాగే గ్రీన్‌ టీ లో కూడా మెండుగా ఉండే రెసిపెరిట్రాల్‌ పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఇది రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌, అమైనో యాసిడ్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు హానికారక బ్యాక్టీరియా, వైరస్‌ లతో పోరాడతాయి. శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. అలర్జీలతో పోరాడుతుంది. గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

అలాగే మజ్జిగలో పోషకాలు అధికంగా ఉంటాయి. మజ్జిగలో సోడియం, క్యాల్షియం మూలకాలు మెండుగా ఉంటాయి. వీటితో పాటు ప్రొటీన్లు, మినరల్స్‌ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను అందిస్తాయి. మజ్జిగ శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించేస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచి బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. దీనిలోని పోషకాలు సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది ముడతలు, ఫైన్‌ లైన్లను నివారిస్తుంది.​ టమాటాలోని లైకోపీన్, UVA, UVB రేడియేషన్‌ లను గ్రహిస్తుంది. సన్‌బర్న్‌ ప్రమాదాలను నివారిస్తుంది. టమాటాలోని యాంటీ ఆక్సిడెంట్లు సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఆదేవిధంగా కొబ్బరి నీళ్లను సహజమైన మాయిశ్చరైజర్‌ అని పిలుస్తుంటారు. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. కొబ్బరి నీళ్లు రోజూ తాగితే చర్మం మృదువుగా, తేమగా ఉంచుతాయి. కొబ్బరి నీళ్లలోని పోషకాలు చర్మంలోని మలినాలను తొలగించి స్కిన్‌ టోన్‌ని మెరుగుపరుస్తుంది. అలాగే ఎండ నుంచి మీ చర్మాన్ని కూడా రక్షిస్తాయి.

Also Read:  Hair Tips: నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే చాలు తలలో పేలు మాయం అవ్వాల్సిందే?