Tomato Juice : టమాటా రసంలో ఇది కలిపి రాస్తే చాలు.. ఎలాంటి డార్క్ సర్కిల్స్ అయినా మాయం అవ్వాల్సిందే?

టమాటా రసంలో (Tomato Juice), నిమ్మరసం మిక్స్‌ చేసి ఆ మిశ్రమాన్ని కాటాన్ బాల్‌తో కళ్ల కింద భాగంలో అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

Published By: HashtagU Telugu Desk
Tomato Face Masks

Tomato Face Masks

Tomato Juice for Dark Circles : ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు అనేక కారణాల వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. డార్క్ సర్కిల్స్ కారణంగా చిన్న వయసులోనే పెద్దవాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖం కూడా అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మహిళలు ఆ డార్క్ సర్కిల్స్ ని కవర్ చేసుకోవడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. వాటి కారణంగా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డార్క్ సర్కిల్స్ మాయం అవ్వాలి అంటే ఈ వంటింటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. మీరు డార్క్‌ సర్కిల్స్‌తో ఇబ్బందిపడుతుంటే రాత్రి పూట నిద్రపోయే ముందు కొన్ని చుక్కల బాదం నూనె తీసుకుని కళ్ల కింద భాగంలో అప్లై చేసి, ముందు మృదువుగా మసాజ్ చేయాలి.

We’re Now on WhatsApp. Click to Join.

రాత్రంతా అలాగే ఉంచి ఉదయం శుభ్రం చేసుకోవాలి. బాదం నూనె చర్మానికి పోషణ, తేమను అందించడానికి తోడ్పడుతుంది. ఇది డార్క్‌ సర్కిల్స్‌ను తగ్గిస్తుంది. కీరాదోసని సన్నని ముక్కలుగా కట్‌ చేసి, వాటిని మూసిన కళ్లపై ఉంచి రిలాక్స్‌ అవ్వాలి. వీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. కీరాలోని శీతలీకరణ ప్రభావాలు కళ్లను రిలాక్స్‌ చేస్తాయి. కళ్ల ఉబ్బరం, డార్క్‌ సర్కిల్స్‌ తర్వగా తగ్గిస్తాయి.​ కళ్ల కింద నల్లటి వలయాల సమస్యతో బాధపడుతుంటే పైనాపిల్ జ్యూస్‌లో చిటికెడు పసుపు పొడిని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను కళ్ల కింద భాగంలో అప్లై చేసి, 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

రోజ్‌ వాటర్‌లో కాటన్‌ ప్యాడ్‌లను ముంచి, వాటిని మీ కళ్లపై 10-15 నిమిషాల పాటు ఉంచండి. రోజ్‌ వాటర్‌ చర్మ pH స్థాయిలను బ్యాలెన్స్ ‌చేస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని పునరుద్ధరించడానికి, నల్లటి వలయాలను తగ్గించడానికి తోడ్పడుతుంది. టమాటా రసంలో (Tomato Juice), నిమ్మరసం మిక్స్‌ చేసి ఆ మిశ్రమాన్ని కాటాన్ బాల్‌తో కళ్ల కింద భాగంలో అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. టమాటా జ్యూస్‌ (Tomato Juice)లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నల్లటి వలయాలను తేలికపరచడానికి సహాయపడతాయి. ఇలా తరచు చేయడం వల్ల నల్లటి వలయాలు దూరం అవుతాయి. తాజా కలబంద గుజ్జును కంటి కింద అప్లై చేసి, సున్నితంగా మసాజ్‌ చేసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. కలబంద చర్మాన్ని తేమగా, శాంతపరచడానికి సహాయపడుతుంది. డార్క్ సర్కిల్స్ రూపాన్ని తగ్గిస్తుంది.

Also Read:  Temple Rules: మాంసాహారం తిని గుడికి వెళ్లకూడదా.. వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా?

  Last Updated: 08 Dec 2023, 04:44 PM IST