Site icon HashtagU Telugu

Avocado Oil : అవకాడో ఆయిల్ తో ఇలా చేస్తే చాలు.. ఎలాంటి మొటిమలైన మాయం అవ్వాల్సిందే?

Just Do This With Avocado Oil.. What Kind Of Pimples Will Disappear..

Just Do This With Avocado Oil.. What Kind Of Pimples Will Disappear..

Benefits of Avocado Oil : అవకాడో వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఈ పండులో విటమిన్ ఎ, ఇ, బి6, సి, కె, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, నియాసిన్‌ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే పెద్ద సంఖ్యలో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా లభిస్తాయి. అవకాడో (Avocado) ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తరిమికొడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అవకాడో నూనె (Avocado Oil) చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మార్కెట్లో దొరికే చాలా రకాల మాయిశ్చరైజర్లు, సీరమ్‌లు, క్రీమ్‌లు‌, మాస్క్‌ల తయారీలో అవకాడో నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. మరి మొటిమలు ఉన్నవారికి ఈ అవకాడో నూనె ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అవకాడో నూనెలో విటమిన్‌ ఇ, పొటాషియం, లెసిథిన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఈ నూనె చర్మానికి అప్లై చేయడం వల్ల పోషణ అందించి, తేమగా ఉంచుతుంది. సహజంగానే, ఈ నూనెలోని మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ పొడిబారిన, కఠినమైన చర్మ ఆకృతిని మెరుగుపరుస్తాయి. చర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి కూడా సహాయపడతాయి.

అవకాడో ఆయిల్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమల వాపును తగ్గించడానికి సహాయపడతాయి, తక్కువ సమయంలోనే మొటిమలకు చికిత్స చేస్తుంది. మీరు మొటిమలతో ఇబ్బంది పడుతుంటే రాత్రి పూట ముఖానికి అవకాడో ఆయిల్‌ అప్లై చేసి సున్నితంగా మసాజ్‌ చేయాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మొటిమలు త్వరగా మాయం అవుతాయి. అంతేకాదు, మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే మొటిమలు తాలూకా మచ్చలు కూడా మాయమవుతాయి. అవకాడో ఆయిల్‌ యూవి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అవోకాడో నూనెలో విటమిన్ ఈ,డి ప్రోటీన్, లెసిథిన్ హీలింగ్‌ను పెంచుతాయి. మిమ్మల్ని యవ్వనంగా ఉంచడానికి అవకాడో ఆయిల్‌ సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలో కొల్లాజెన్‌ తగ్గుతూ ఉంటుంది. అవోకాడో నూనె కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని, చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. కాగా అవకాడో ఆయిల్‌ను జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు.

Also Read:  Water vs Food : అలాంటి ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?