Jowar Cake: ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి కేక్ ను ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?

మాములుగా మనకు బయట మార్కెట్లో బ్రేకరీలో ఎన్నో రకాల కేకులు లభిస్తూ ఉంటాయి. ఈ కేక్స్ లో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలి

Published By: HashtagU Telugu Desk
Mixcollage 14 Mar 2024 08 04 Pm 8092

Mixcollage 14 Mar 2024 08 04 Pm 8092

మాములుగా మనకు బయట మార్కెట్లో బ్రేకరీలో ఎన్నో రకాల కేకులు లభిస్తూ ఉంటాయి. ఈ కేక్స్ లో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది బ్రేకరీలో చేసిన కేక్స్ ని అంతగా ఇష్టపడదు. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇంట్లోనే అలా ఏవైనా సరికొత్తగా కేక్స్ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే సింపుల్గా జొన్నపిండి కేకును తయారు చేసుకోండిలా.

కావాల్సిన పదార్థాలు :

జొన్న పిండి – ఒక కప్పు
క్యారెట్ తురుము – ఒక కప్పు
అరటి పండ్లు – రెండు
పాలు – అర కప్పు
బెల్లం పొడి – కప్పు
బటర్ – 3 టీ స్పూన్లు
బేకింగ్ పొడి – అర స్పూను
బేకింగ్ సోడా – అర స్పూను
బాదం పప్పులు – అర కప్పు
దాల్చిన చెక్క పొడి – అర స్పూను
ఉప్పు – చిటికెడు

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి అందులో జొన్న పిండిని వేసి మాడి పోకుండా కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కేకు పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అరటి పండ్లను చేత్తో నలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. వేయించిన జొన్న పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో అరటి పండ్ల పేస్టు, కాస్త బటర్ వేసి బాగా కలపాలి. విస్కర్ సాయంతో అయితే బాగా కలుస్తాయి. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పొడి, దాల్చిన చెక్క పొడి కూడా మళ్లీ గిలక్కొట్టాలి. బెల్లం పొడి, క్యారెటు తురుము వేసి కలపాలి. ఇప్పుడు గోరు వెచ్చని పాలు వేసి బాగా గిలక్కొట్టాలి. మరీ మందంగా కాకుండా, అలాగే మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. కేక్ మౌల్డ్‌కు కాస్త వెన్న రాసి పైన చిటికెడు జొన్న పిండి వేసి, కేకు మిశ్రమాన్ని అన్నివైపులకు సమానంగా సర్దాలి. బాదం పప్పులు పైన చల్లాలి. ముందుగా మైక్రో ఓవెన్‌ను 180 డిగ్రీలు ప్రీ హీట్ చేసుకోవాలి. అందులో కేకు మౌల్డ్ పెట్టాలి. సరిగ్గా 45 నిమిషాల పాటూ ఉంచితే కేకు రెడీ..

  Last Updated: 14 Mar 2024, 08:05 PM IST