Site icon HashtagU Telugu

Jonna Murukulu: ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే జొన్న మురుకులు తయారు చేసుకోండిలా?

Mixcollage 27 Dec 2023 02 47 Pm 1951

Mixcollage 27 Dec 2023 02 47 Pm 1951

సాధారణంగా మనం బియ్యప్పిండి, మినప పిండి పెసర పిండితో తయారుచేసిన మురుకులు తింటూ ఉంటాం. ఎక్కువ శాతం మంది వీటిని తయారు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా జొన్న మురుకులు తిన్నారా. ఇవి కూడా తినడానికి ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉంటాయి. మరి ఈ జొన్న మురుకులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జొన్నమురుకులకు కావాల్సిన పదార్ధాలు:

జొన్నపిండి – 3 కప్పులు
నువ్వులు – అర కప్పు
వేరుశనగపొడి – 1 కప్పు
వాము – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చిపేస్టు – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
వెన్న- 2 టేబుల్ స్పూన్స్
నూనె – సరిపడా

జొన్నమురుకులు తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా జొన్నపిండిలో నువ్వులు, వేరుశనగపొడి, వాము, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, 2 చెంచాల వెన్న వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్లు పోసి మెత్తగా మురుకుల పిండి వలె చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై ఒక కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత మురుకుల పీఠతో ఒత్తుకోవాలి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సన్నని మంటపై వేయించుకోవాలి. ఇలా చేస్తే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా కరకరలాడే మురుకులు సిద్ధమవుతాయి. అంతే ఎంతో టేస్టీగా ఉండే జొన్నమురుకులు రెడీ.