Jeera Rice: ఎంతో టేస్టీగా జీరా రైస్ ఇలా చేస్తే చాలు.. కొంచెం కూడా మిగలదు?

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ న

Published By: HashtagU Telugu Desk
Mixcollage 31 Dec 2023 02 52 Pm 2296

Mixcollage 31 Dec 2023 02 52 Pm 2296

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. జీరా రైస్ టమాటా రైస్ గోబీ రైస్ ఎగ్ రైస్ వంటి రెసిపీలను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటిని ఇంట్లో ఎంత రుచిగా చేసినా కూడా హోటల్ మాదిరిగానే కావాలని అంటూ ఉంటారు. అయితే మరి హోటల్లో చేసిన విధంగానే జీరా రైస్ ని ఇంట్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు:

బియ్యం -1 కప్పు
పచ్చిమిర్చి – 4
జీలకర్ర -1 టేబుల్ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – సరిపడా

తయారీ విధానం:

ముందుగా స్టౌ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టి, కుక్కర్ వేడి అయిన తర్వాత టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడి అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. అవి రెండు వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేయాలి. ఈ మూడింటిని ఒక నిమిషం పాటు నెమ్మదిగా కలపాలి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసి నీళ్లు పోయాలి. కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చాక స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత ఒక చిన్న పాన్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి వేడి అయ్యాక జీడిపప్పు వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించాలి. వండిన జీరా రైస్‌లో నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి అలంకరించాలి. అంతే సింపులో రుచికరమైన వేడి వేడి జీరా రైస్ రెడీ. మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు.

  Last Updated: 31 Dec 2023, 02:52 PM IST