Site icon HashtagU Telugu

Jeera Rice: జీరారైస్ ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Jeera Rice

Jeera Rice

ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో చేసిన వంటల కంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా గోబీ రైస్, జీరా రైస్, ఎగ్ రైస్, టమోటా రైస్, ఘీ రైస్ అంటూ రకరకాల రైసులను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే బయట తయారు చేసే ఆ రైస్ లను ఇంట్లో చేసినా కూడా వాటిని చాలామంది తినడానికి ఎంతగా ఇష్టపడరు. ఎందుకంటే బయట రకరకాల మసాలాపొడులు వాడి ఎంతో టేస్టీగా తయారుచేస్తారు. అయితే మరి చిన్న పిల్లలుపెద్దలు మెచ్చే విధంగా ఇంట్లోనే జీరా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జీరా రైస్ కావలిసినవి:

బియ్యం – నాలుగు కప్పులు
జీలకర్ర – ఒక చిన్న కప్పు
కరివేపాకు – రెండు కట్టలు
పచ్చిమిర్చి – పది
ఉప్పు, నూనె – తగినంత

జీరా రైస్ తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి. ఈ లోపు ఎసరు పెట్టి అది బాగా కాగిన తర్వాత బియ్యం పోసి అన్నం ఉడికిన తర్వాత పూర్తిగా వార్చేసి చల్లార్చాలి. ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత దాంట్లో జీలకర్రను ముందుగా వేసి దాన్ని వేగనిచ్చి కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు ముక్కలను వేసి అవి కూడా వేగిన తర్వాత అన్నాన్ని చేర్చి బాగా ఫ్రై చేయ్యాలి. ఈ మిశ్రమంలో ఉప్పును కూడా వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ.

Exit mobile version