Site icon HashtagU Telugu

Jasmine: సువాసనలు వెదజల్లే మల్లెపువ్వుతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండిలా?

Jasmine Flowers

Jasmine Flowers

మల్లెపువ్వు సువాసన గురించి మనందరికీ తెలిసిందే. దీని సువాసన ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోవడానికి అలాగే దేవుళ్ళ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ పువ్వు నూనె విషయానికొస్తే.. ఇది మల్లెపువ్వు వంటి సువాసనగా ఉంటుంది. ఈ నూనె సుగంధంగా ఉండటమే కాకుండా పుష్కలమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. జాస్మిన్ ఆయిల్ జుట్టుకు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు.

కానీ శారీరక సమస్యల నుండి బయటపడటానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. మల్లె నూనెను క్వీన్ ఆఫ్ ది నైట్ అని కూడా పిలుస్తారు. మల్లెపువ్వు మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, మల్లె నూనెను డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి సహజ నివారణగా వాడుతున్నారు. కాగా ఈ నూనె కేవలం జుట్టుకు సంబంధించిన సమస్యలకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. దీని నుంచి విముక్తి పొందాలంటే నిత్యం జాస్మిన్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవచ్చు.

ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ లక్షణాలు ఎముకలు, కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. జుట్టు రాలడం లేదా విరిగిపోయే సమస్య ఉన్నట్లయితే, జాస్మిన్ ఆయిల్‌తో మసాజ్ చేయవచ్చు. జాస్మిన్ ఆయిల్ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ నూనెను రాసుకోవడం వల్ల జుట్టు పొడవుగా, నల్లగా, మెరుస్తూ ఉంటుంది. జాస్మిన్ ఆయిల్ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది.
చర్మం వాపు, ఎరుపు లేదా చికాకు సమస్య ఉన్నప్పటికీ జాస్మిన్ ఆయిల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

జాస్మిన్ ఆయిల్‌తో మీ చర్మాన్ని క్రమం తప్పకుండా మసాజ్ చేయడం ద్వారా, మీరు ఈ సమస్యలను సులభంగా వదిలించుకోవచ్చు. జాస్మిన్ ఆయిల్‌తో రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల శరీర అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. అలాగే మన రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. జాస్మిన్ ఆయిల్ మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజూ ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, కోపం, మతిమరుపు వంటివి దూరమవుతాయి.. ఈ ఆయిల్ ని తరచుగా ఉపయోగిస్తే తెల్ల జుట్టు సమస్య రాదు.