Dry Skin: మీ చర్మం ఎల్లప్పుడూ డ్రైగా ఉంటుందా.. ఈ వ్యాధుల వల్లే అలా జరుగుతుందేమో!!

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 06:25 AM IST

మీకు చర్మం తరచూ పొడిబారుతుంటుందా.. ? శీతాకాలంతో పాటు ఇతర సీజన్లలోనూ ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోందా? అయితే బీ అలర్ట్. చర్మం తరచూ పొడిబారడం కొన్ని సీరియస్ వ్యాధుల లక్షణం కూడా.
ఉష్ణోగ్రతలో తేడా, నీరు తక్కువగా తాగడం వల్ల ఇలా జరుగు తుంటుంది. అలసట, తల తిరగడం, నోరు పొడిబారడం వంటి సమస్యలు కూడా చర్మం తరచూ పొడిబారే వాళ్లలో కనిపిస్తాయి.

పొడి చర్మం.. ఆరోగ్య సమస్యలు

కిడ్నీ సమస్య ఉన్న కొందరిలోనూ చర్మం తరచూ పొడి బారుతుంటుంది. రక్తాన్ని ఫిల్టర్ చేసి..కాల్షియం, పొటాషియం పోషకాల సమతుల్యతను నియంత్రించడం కిడ్నీలు చేసే పని. శరీరంలోని ఇతర భాగాల పనితీరు, హార్మోన్స్ విడుదలలో కూడా కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. కిడ్నీల్లో సమస్య ఉంటే వివిధ రకాల రుగ్మతలు తలెత్తుతాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం..కిడ్నీ సమస్య ఉంటే చర్మ సంబంధిత సమస్యల లక్షణాలు బయటపడతాయి. చర్మం దురదగా ఉండటం, తేమ కోల్పోవడం, పొలుసులుగా ఉండటం ప్రధానంగా కన్పిస్తుందట. ఫిష్ స్కేల్ స్కిన్ ఏర్పడుతుందని అమెరికన్ డెర్మటాలజీ చెబుతోంది. అందుకే ఇటువంటి ఏ లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

* పొడి చర్మంవారు ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే.. చర్మం పొడిబారుతుంది. ఒకొక్కసారి చర్మ సంబంధ వ్యాధులు తామర వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఒక్కొక్కరిలో ఒక్కోలా..

ఇక కిడ్నీలో సమస్య వచ్చినప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు ఆ ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. కొందరిలో చర్మం పొడి బారడం, దురద వంటివి ఉండవచ్చు. దీంతో పాటు వీపు భాగంలో, చేతుల్లో దురద కలగొచ్చు. చర్మం తరచూ పొడిబారడమనేది సాధారణ లక్షణమే అయినా అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని సూచిస్తుంది. క్రీమ్స్, లోషన్స్ వాడుతూ ఆ సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంటారు.

పొడి చర్మం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* రోజంతా మీ శరీరం సున్నితంగా మృదువుగా ఉంచడానికి రోజూ తగినంత నీటిని తాగాలి.  చర్మం  పొడిబారితే.. స్కిన్ పొరలుగా కనిపిస్తుంది.  పగుళ్లు ఏర్పడతాయి. కనుక చర్మం తేమగా ఉంటే చర్మం మృదువుగా ఉంటుంది. కనుక తగిన నీటిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

* పొడి చర్మ తీరుకు సరిపడే మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. రెగ్యులర్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తే శీతాకాలంలో చర్మానికి వచ్చే ఇబ్బందులను అరికడుతుంది. అంతేకాదు చర్మం తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

* సీజన్‌లలో మార్పుకు అనుగుణంగా చర్మ సంరక్షణలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ తీరుకు వాతావరణానికి అనుగుణంగా తీసుకునే చర్యలతో సీజన్ మొత్తం చర్మం మృదువుగా సున్నితంగా మెరుస్తూ ఉంటుంది

శీతాకాలంలో చేయకూడని పనులు..

* చర్మాన్ని మృదువుగా మర్దన చేయడం వల్ల  చర్మ కణాలు, మలినాలు పోయి.. స్కిన్ లోని రంధ్రాలు తెరుచుకుంటాయి. అయితే చర్మంపై పొలుసు అధికంగా ఉంటే చర్మం పొడిబారి ఇబ్బందికి గురవుతారు. చర్మం ఎరుపుగా మారుతుంది.

* కొన్నికొన్ని సార్లు మంట కూడా వచ్చి చికాకు కూడా వస్తుంది.
పొడి చర్మం గలవారు ఆల్కహాల్‌ ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిది.
* చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకునే ముందు వాటిని ఒక్కసారి పరిశీలించి తీసుకోవాలి. ఎందుకంటే టోనర్‌లు,  క్లెన్సర్‌లు వంటి వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఆల్కహాల్ ఉండవచ్చు. అటువంటి ఉత్పత్తులను చర్మానికి అప్లై చేస్తే మరింత పొడిబారి ఇబ్బంది అధికమవుతుంది.
* శీతాకాలం అంటే ఎక్కువ మంది వేడి నీరుని స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే పొడి చర్మం వారు అధిక వేడి నీటికి దూరంగా ఉండడం మంచిది.