Site icon HashtagU Telugu

Mobile Phone : ఉదయం లేవగానే ఫోన్ చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Tariff Hikes

Tariff Hikes

Using Mobile Phone Early in the Morning? : సెల్ ఫోన్ ల వల్ల లాభాలు ఎన్నున్నాయో నష్టాలు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఫోన్ చూస్తూ ప్రపంచాన్నే చాలామంది మర్చిపోతున్నారు. ఇక తమ కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన యువత సెల్ ఫోన్ లో రీల్స్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. టెక్నికల్ డెవలప్మెంట్ ప్రపంచస్థాయికి ఈక్వల్ గా ఉన్నా సరే వాటిని వాడుకోవడం లో మాత్రం మన వాళ్లు వెనకబడి ఉన్నారు. అయితే సెల్ ఫోన్ (Mobile Phone)తో లాభాల కన్నా నష్టాలే ఎక్కువని తెలిసినా దాన్ని వాడుతుంటారు. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ ని వెతడం కామనే. కొందరైతే తమ పక్కనే పెట్టుకుని పడుకుంటారు.

సెల్ ఫోన్ (Mobile Phone) వాడకం శృతి మించితే అనర్ధాలు తప్పవు. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా ఆరోగ్యం మీద పడుతుంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు వైద్య నిపుణులు. ఉదయం పూట సెల్ ఫోన్ నోటిఫికేషన్, ఈ మెయిల్, మిగత అప్డేట్స్ లను చూస్తూ అనవసరమైన ఒత్తిడికి గురవుతారని తెలుస్తుంది. అంతేకాదు పొద్దునే లేచి మొదలు అన్ని పనులు ఫోన్లే చేస్తుంటారు. ఏదో ఒకటి వెతకటం, వాట్సాప్ మెసేజ్ లు చూడటం లాంటివి మానసిక స్థితిని డిస్ట్రబ్ చేస్తాయని చెబుతున్నారు.

తరచు సెల్ ఫోన్ (Mobile Phone) చూడటం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బ తింటుందని.. ఫోన్ చూసేందుకు అలవాటు పడిన వారంతా కూడా నిద్రలేమి సమస్యతో బాధపడతారు. మంచి ఆరోగ్యానికి కచ్చితంగా 7, 8 గంటల నిద్ర అవసరం కానీ అలా కాకుండా రాత్రి లేట్ గా పడుకుని ఉదయం ఎర్లీగా లేచేందుకు కష్టంగా ఉంటుంది. నైట్ ఎక్కువగా మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల బూలైట్ మెల్టోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. నిద్ర రావడానికిం సహకరించే ఈ హార్మోన్ లోపం వల్ల నిద్రలేమి సమస్యలు అధికమవుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అందుకే అవసరానికి తప్ప ఎక్కువ సెల్ ఫోన్ వాడటం వల్ల అనవసరమైన అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే అని తెలుస్తుంది.

Also Read:  Jackfruit Seeds: పనసపండు విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?