Face Wash Tips : దీంతో ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుంటే చాలు.. ముఖం అందంగా మెరిసి పోవాల్సిందే..

మన వంటింట్లో దొరికే మూడు రకాల పదార్థాలతో ఫేస్ వాష్ (Face Wash) తయారు చేసుకున్నట్లయితే మొఖం అందంగా, కాంతివంతంగా తయారవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు.

  • Written By:
  • Updated On - January 5, 2024 / 04:41 PM IST

Tips for Face Wash : మామూలుగా ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు పెట్టి మేకప్ కిట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్లి అక్కడ కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అంద విహీనంగా కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ముఖం అందంగా మెరిసిపోవాలంటే దీంతో ఒక్కసారి ఫేస్ వాష్ (Face Wash) చేయాలి అంటున్నారు నిపుణులు.

We’re Now on WhatsApp. Click to Join.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. మన వంటింట్లో దొరికే మూడు రకాల పదార్థాలతో ఫేస్ వాష్ (Face Wash) తయారు చేసుకున్నట్లయితే మొఖం అందంగా, కాంతివంతంగా తయారవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు. దీనికోసం ముందుగా రెండు స్పూన్ల గోధుమపిండి తీసుకోవాలి. గోధుమ పిండి ముఖంపై ఉండే జిడ్డు, మురికి పోగొట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసుకోవాలి. దీనిని పేస్టుగా కలుపుకోవడానికి సరిపడినన్ని చల్లటి పాలు వేసుకోవాలి. చల్లటి పాలు వేసుకోవడం వలన ముఖం చల్లగా ఉంటుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కొని ప్యాక్ అప్లై చేసుకోవాలి.

రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ఉండే జిడ్డు, మురికి పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ఉండే సన్ టాన్, నల్లటి మచ్చలు, డార్క్ సర్కిల్స్, మొటిమల వలన వచ్చిన మచ్చలు వంటి సమస్యలు తగ్గిస్తాయి. ఈ ప్యాక్ ను వారానికి రెండు మూడు సార్లు వేసుకుంటే ముఖం ఫ్రెష్ గా తెల్లగా మెరిసిపోతుంది. అలాగే ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్రీన్ టీ పౌడర్ ఓపెన్ ఫోర్స్ సమస్యను తగ్గిస్తుంది. గోధుమపిండి చర్మాన్ని బిగుతుగా చేసి యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. ఈ ఫేస్ వాష్ తో ముఖంపై ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ వలన ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.

Also Read:  Pudina Rice Recipe: పుదీనా రైస్.. ఈ కొలతలతో చేస్తే.. వద్దనకుండా తినేస్తారు