Site icon HashtagU Telugu

Hair Turns White: మనుషుల జుట్టు ఎందుకు తెల్లబడుతుందో తేలిపోయింది..!

Premature Hair Greying

White Hair

మనుషుల జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? (Hair Turns White) దానికి అసలు కారణం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకునే దిశగా అమెరికాలోని న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన రీసెర్చ్ లో పలు కొత్త విషయాలు వెలుగుచూశాయి. మెలానో సైట్ స్టెమ్ సెల్స్ అనేవి మన జుట్టుకు సంబంధించిన వర్ణద్రవ్యం తయారు చేస్తాయి. మనిషి వయస్సు పెరిగేకొద్దీ జుట్టు కుదుళ్లలో ఉండే మెలానో సైట్ స్టెమ్ సెల్స్ అనే మూలకణాలు బలహీనం అవుతున్నట్లు స్టడీలో గుర్తించారు. దీనివల్లే జుట్టు రంగును ఒకే స్థాయిలో నిర్వహించే సామర్థ్యాన్ని మెలానో సైట్ స్టెమ్ సెల్స్ కోల్పోతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది.

ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ మేరకు వివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్ ” నేచర్” జర్నల్‌ లో పబ్లిష్ అయింది. కొన్ని మెలానో సైట్ స్టెమ్ సెల్స్ జుట్టు కుదుళ్లలోని గ్రోత్ కంపార్ట్‌ మెంట్ల మధ్య కదిలే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే అవి మనిషి వయస్సు పెరిగేకొద్దీ చిక్కుకుపోతాయి.. పలుచబడుతాయి.. ఇందువల్ల జుట్టు రంగును కాపాడే సామర్థ్యాన్ని మెలానో సైట్ స్టెమ్ సెల్స్ కోల్పోయాయి.

■జన్యువుల వల్లే

పుట్టుకతో సంక్రమించే జన్యువులే మనిషి రంగు, రూపు లాంటి చాలా అంశాలను నిర్ణయిస్తాయి. మనుషుల జాతి, ప్రాంతాన్ని బట్టి కూడా జుట్టు రంగు మారే వయసులో తేడాలుంటాయి. అయినా ఈ అంశం పైన చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వాళ్లలో జుట్టు తెల్లబడితే దాన్ని జబ్బుగా పరిగణించాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా స్వీకరిస్తారు. కొంతమంది తమ సమస్యను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు మాత్రం దాన్నే తమ స్టయిల్ స్టేట్‌మెంట్‌గా భావించి జుట్టును అలానే రంగు వేయకుండా వదిలేస్తారు. జుట్టుకు రంగు వేయడం అనేది సమస్యకు తాత్కాలిక పరిష్కారమే దొరుకుతుంది. ఆపైన జుట్టుకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

Also Read: Troubled With Stomach Gas: పొట్టలో గ్యాస్ తో ఇబ్బందిపడుతున్నారా..? అయితే కారణాలు అవే..!

■రసాయన ఉత్పత్తుల వాడకం

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెలబడుతుంది. సాంపూ వంటి హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

■ విటమిన్ లోపం

శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోవడం మీ జుట్టు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఫోలిక్ యాసిడ్, బయోటిన్ వంటి పోషకాల లోపంతో జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఈ పోషకాల లోపాన్ని తీర్చడానికి, డైరీ ఉత్పత్తులు, గుడ్లు, మాంసం వంటి ముఖ్యమైన ఆహారాలను తీసుకోండి.

Exit mobile version