Eating: మితమే హితం.. ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలే

  • Written By:
  • Updated On - March 30, 2024 / 10:01 PM IST

Eating: ఏదైనా మితంగా తింటేనే మంచిది. అయితే మరి ఏ ఏ పదార్థాలు మితంగా తినాలో చాలామందికి తెలియవు. అందుకే మీకోసం కొన్ని టిప్స్ అందిస్తున్నాం. ఆహారంలో పాలు ఒక భాగం. వాటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది చేస్తాయనుకుంటారు. ముఖ్యంగా చిన్న వయసు వాళ్లకి ఎక్కువగా తాగిస్తుంటారు. అయితే వాటిని మోతాదు మించి తాగితే ఎముకలు విరగడానికి కారణం అవుతాయి. ఇక అలసటగా ఉన్నా లేక ఎనర్జీ కావాలన్నా చక్కని పానీయం కొబ్బరినీళ్లు.

వెంటనే శక్తిని ఇస్తాయి. ఈ హెల్తి ఫుడ్ ని పక్కాగా తీసుకోవాలి. అయితే మోతాదు మించకుండా జాగ్రత్త పడటం మేలు. పోషకాహార నిపుణులు సూచించిన మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మంచివే కానీ, వీటిని మితిమీరి తీసుకుంటే మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్, పొటాషియం లెవెల్స్ శరీరంలో చాలా పెరిగిపోతాయి.

అరటి పండ్లు అప్పటికప్పుడు బలాన్ని చేకూర్చే దానికి ప్రతిరూపాలుగా చెప్పుకోవచ్చు. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లను మరీ ఎక్కువగా తింటే ముప్పు తప్పదు. వీటిని ఎక్కువగా తింటే గుండె సమస్యలు, నరాలు, కండరాల్లో సమస్యలకు కారణమవుతుంది.  ఇక టమాటాలు కూడా ఎక్కువగా తినేవాళ్లు ఉన్నారు. అయితే టేస్టీగా ఉంటుంది కదా అని ఎక్కువ మొత్తంలో టమాటాలు వాడటం చేటే. అందులో ఎక్కువ మోతాదులో ఆమ్లా స్వభావం ఉంటుంది. ఇది ఫ్రీ క్యాన్సర్ కు కారణం అవుతుంది. అందుకే తినబోయే ప్రతి ఫుడ్ ఐటమ్ మితంగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.