Vasthu Tips: వాస్తు శాస్త్రాన్ని నమ్మొచ్చా.. శాస్త్రీయ కోణం ఉంటుందా?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇంటిని నిర్మించే

  • Written By:
  • Publish Date - November 5, 2022 / 05:50 PM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇంటిని నిర్మించే సమయం నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు ప్రతి ఒక విషయంలో వాస్తు విషయాలను పాటిస్తూనే ఉంటారు. అయితే వాస్తు శాస్త్రాన్ని నమ్మొచ్చా? శాస్త్రీయ కోణం కూడా ఉంటుందా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.. సాధారణంగా చాలామంది పగిలిన అద్దాలను ఇంట్లో పెట్టుకుని వాటిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచడం వల్ల దాని నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ కారణంగా కీడు జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అలాగే ఆ పగిలిన అద్దాలు అనుకోకుండా మన కాలికి గుచ్చుకున్నప్పుడు అవి సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంట్లో పనిచేయని గోడ గడియారం పెట్టుకోకూడదు. ఇలా పని చేయని గోడ గడియారం వల్ల దురదృష్టం వెంటాడుతుంది అని శాస్త్రం చెబుతోంది. సైంటిఫిక్ పరంగా చూసుకుంటే ఆగిపోయిన గోడ గడియారం సరైన టైంలో చూపించదు. కొన్ని కొన్ని సార్లు మనం మతిమరుపు కారణంగా ఆ టైమ్ ని చూసి కరెక్టే అనుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో చనిపోయిన మొక్కలను కుండీలో ఉంచకూడదు.

ఆ మొక్కలను తొలగించి వాటి స్థానంలో మరొక మొక్కను నాటాలి. లేదంటే వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. సైంటిఫిక్ పరంగా చూసుకున్నా కూడా చనిపోయిన మొక్కకు బదులు బతికి ఉన్న మొక్కలు నాటితే ఆక్సిజన్ కూడా లభిస్తుంది. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం ఎప్పుడూ కూడా బాత్రూం టాయిలెట్ డోర్లను మూసి ఉంచాలి. లేదంటే ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. సైంటిఫిక్ పరంగా చూసుకుంటే బాత్రూం డోర్లను తెరిచి ఉండడం వల్ల అందులో ఉండే సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా గాలి ద్వారా ఇంట్లోకి చేరి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారం ఎప్పుడూ ఇంటి ముఖ ద్వారం డోర్ ఇప్పుడు కూడా డ్యామేజ్ అయి ఉండకూడదు.

అలా ఉండటం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మెయిన్ డోర్ పగిలిపోయి ఉండడం డామేజ్ అయి ఉండడం వల్ల దొంగలు ఇంట్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ వాడిపోయిన పూలను పెట్టకూడదు. అలా చేయడం వల్ల చెడు జరుగుతుంది వాస్తు ప్రకారంగా చెబుతూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో సూర్యాస్తమయం తరువాత చీపురుతో ఇల్లు ఊడ్చకూడదు. సైంటిఫిక్ పరంగా చూసుకుంటే వెలుతురులో కసువు ఊడ్చేటప్పుడు పురుగు పుట్రా వంటివి రాత్రి సమయంలో కుట్టే అవకాశం కూడా ఉంటుంది. వాస్తు శాస్త్ర ప్రకారం సాయంత్రం సమయంలో ఇంట్లో నిద్ర పోయే వారు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. సైంటిఫిక్ పరంగా చూసుకుంటే సాయంత్రం వేళ నిద్రపోతే రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టదు. దాంతో తలనొప్పి అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.