Site icon HashtagU Telugu

Beauty Tips: ప్రతిరోజు జుట్టుకు షాంపూ అప్లై చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

Beauty Tips

Beauty Tips

మామూలుగా చాలామందికి షాంపూతో తలస్నానం చేయడం అలవాటు. కొందరు వారానికి రెండు లేదా మూడుసార్లు షాంపుతో తల స్నానం చేస్తే మరికొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే షాంపు ని ఉపయోగించడం మంచిదే కానీ అలా అని ప్రతిరోజు ఉపయోగించడం అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు. మరి షాంపు ఎక్కువగా ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాడీ వాష్ కు, షెయిర్ వాష్ కు చాలా తేడా ఉంటుంది. మనం సాధారణంగా శరీరాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగించే సబ్బును జుట్టును క్లీన్ చేయడానికి ఉపయోగించరు.

ఎందుకంటే ఇది జుట్టును దెబ్బతీస్తుంది. అందుకే జుట్టుకు మాత్రమే ఉపయోగించే షాంపూలను ఉపయోగించాలి. తేలిక పాటి షాంపూ వాతావరణ కాలుష్యం, దమ్ము, ధూళి, చెమట, చెడు వాసనను పోగొట్టడానికి సహాయపడుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. షాంపూలు మన జుట్టును క్లీన్ చేయడమే కాకుండా అదనపు నూనెను తొలగించడానికి కూడా సహాయపడతాయి. చాలా షాంపూల్లో సర్ఫాక్టాంట్లు, సల్ఫేట్లు వంటి రసాయనాలు, సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది నెత్తి, జుట్టు నుంచి నూనెను తొలగించడానికి నురుగు వచ్చేలా చేస్తుంది. దీంతో జుట్టు శుభ్రంగా అవుతుంది. షైనీగా మెరుస్తుంది. చాలా రోజులు షాంపూను వాడకుండా ఉంటే నెత్తిమీద నూనె పేరుకుపోతుంది.

దీంతో నెత్తి, వెంట్రుకలు మురికిగా, జిడ్డుగా కనిపిస్తాయి.జుట్టును తరచుగా కడగడం వల్ల ఈ రక్షిత పొర తొలగిపోతుంది. దీంతో జుట్టు పొడిబారుతుంది. వెంట్రుకలు తొగిపోతాయి. అలాగే చెమట, పర్యావరణ కాలుష్య కారకాలు, స్టైలింగ్ ఉత్పత్తులు వంటి కారకాలు కూడా నెత్తిమీద మురికి పేరుకుపోయేలా చేస్తాయి. అయితే జుట్టుకు షాంపూ అప్లై చేయడం మంచిదే కానీ అలా అని ప్రతి రోజు తల స్నానం చేయడం మంచిది కాదు. అలాగే గాడత ఎక్కువ ఉన్న షాంపూలు ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ప్రతిరోజు షాంపుతో తలస్నానం చేయాలి అనుకున్న వారు నిపుణుల సలహా మేరకు గాఢత తక్కువ ఉన్న షాంపులను ఉపయోగించి తల స్నానం చేయడం మంచిది..

Exit mobile version