Site icon HashtagU Telugu

Betel Leaves : తమలపాకుతో ఈ విధంగా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగడంతో పాటు ఒత్తుగా పెరగాల్సిందే?

Is It Enough To Do This With Betel Leaves..

Is It Enough To Do This With Betel Leaves..

Benefits of Betel Leaves : ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఒకటి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం అన్నది ఈ రోజుల్లో ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే హెయిర్ ఫాల్ తగ్గడం కోసం చాలామంది హోం రెమిడీస్ ని ఫాలో అవ్వడంతో పాటు మార్కెట్లో దొరికే రకరకాల షాంపులు వాడుతూ ఉంటారు. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా అనేక రకాల చిట్కాలను బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తమలపాకు (Betel Leaves)తో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మళ్లీ జుట్టు రాలమన్న అస్సలు రాలేదు. హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. మరి హెయిర్ ఫాల్ తగ్గి చుట్టూ ఒత్తుగా పెరగాలి అంటే తమలపాకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ఇందుకోసం మనకు మొదట తమలపాకులు కావాలి. తమలపాకు (Betel Leaves) వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఆరు తమలపాకులను తీసుకోవాలి. తర్వాత మందారం ఆకులను కూడా తీసుకోవాలి. అయితే మందారంలో ఎటువంటి ఆకులు తీసుకోవాలి అన్న సందేహం రానే వస్తుంది. ఒంటిరకం మందారం ఆకులను తీసుకోవడం వల్ల అది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది కరివేపాకు. జుట్టుకు సంబంధించిన సమస్యలను సరి చేయడంలో కరివేపాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ మూడింటిని తీసుకున్న తర్వాత కొబ్బరి నూనెను కూడా తీసుకోవాలి.

ఇక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆ నూనె వేసి స్లిమ్ లో పెట్టి మూడు ఆకులను ఆ నూనెలో వేసి బాగా మరిగించాలి. మధ్య మధ్యలో స్పూన్ పెట్టి తిప్పుతూ ఉండండి. ఆకులు తొందరగా మాడిపోతే వాటిలో ఉన్న పోషక తత్వాలు నశించకపోతాయి కాబట్టి తిప్పుతూ ఉండాలి. ఆ నూనె బాగా వేడి అయ్యి ఆకులు కాస్త లైట్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ నూనె చల్లారే వరకు ఆ ఆకులను కూడా అందులోనే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తూ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గడంతో పాటు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవు. అంతేకాకుండా జుట్టు కూడా చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది.

Also Read:  Skin care Tips: చలికి చర్మం పగులుతుందా?.. అయితే ఇలా చేయండి..!