చాలావరకు ముక్కులో వెంట్రుకలు ఉండటం సహజం. అయితే ఈ వెంట్రుకలను కొందరు తమ అందం కోసం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు. కానీ అలా కట్ చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయనంలో తెలిసింది. ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల వాతావరణం లో ఏర్పడే దుమ్ము, దూళి కణాలను, సూక్ష్మజీవులను ముక్కు ద్వారా శ్వాసనాలంలోకి.. ఆ తర్వాత శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటాయి.
ఇక వెంట్రుకలను తొలగించడం వల్ల వాటి కుదుళ్లలో ఏర్పడే రంద్రాల వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిగి రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండటంతో పాటు మెదడుపై అధిక ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మరణానికి కూడా దారితీస్తుందని తెలిసింది. ఇక ముక్కు వ్యాక్సిన్ చేయించుకోవటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసింది.
నిజానికి ముక్కు వెంట్రుకలు మనం పీల్చుకునే గాలిని ఫిల్టర్ చేస్తాయి. గాలిలో ఉండే వైరస్, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే క్రిముల నుండి ఈ వెంట్రుకలు కాపాడుతాయి. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు చాలా సహాయపడతాయి. ముక్కుల్లో కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తాయి. ఇవి కాలుష్యం, ఇతర బ్యాక్టీరియాల వల్ల కలుగుతాయి. కాబట్టి ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు రావని.. ఇతర బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులకు రాకుండా సహాయపడుతుందని తెలుస్తుంది.