Site icon HashtagU Telugu

Hair Removal Cream: హెయిర్ రిమూవల్ క్రీమ్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Hair Removal Cream

Hair Removal Cream

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మార్కెట్లోకి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వచ్చాయి. దీంతో చాలామంది హోమ్ రెమెడీస్ కంటే ఎక్కువగా మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రోడక్ట్ లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అటువంటి వాటిలో హెయిర్ రిమూవల్ క్రీమ్ కూడా ఒకటి. తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అయితే, మీరు హెయిర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఎందుకో ఉపయోగిస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. హెయిర్ రిమూవల్ క్రీమ్స్ నే డెపిలేటరీ క్రీమ్స్ అని కూడా అంటారు. హెయిర్ రిమూవల్ మెథడ్స్‌లో ఇది కూడా ఒకటి.

ఈ క్రీమ్‌ని స్కిన్ కి అప్లై చేసి కొంత సేపు ఆగి కడిగేస్తే హెయిర్ కూడా వచ్చేస్తుంది. మరి ఇది ఎలా పని చేస్తుంది? అన్న విషయంలోకి వెళితే.. ఈ క్రీమ్స్‌లో ఆల్కలీన్ సాల్ట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కెరాటిన్‌లో ఉండే డైసల్ఫైడ్ బాండ్స్ ని బ్రేక్ చేస్తాయి. కెరాటిన్ అనేది హెయిర్ యొక్క ప్రొటీన్ స్ట్రక్చర్. ఈ క్రీమ్స్ హెయిర్ ని హైడ్రొలైజ్ చేసి దాన్ని బలహీనంగా, జెల్లీ లాగా చేస్తాయి, అందువల్ల తేలికగా డిస్సాల్వ్ అయిపోతాయి. అప్పుడు స్పాట్యులాతో సింపుల్ గా తీసేయడమే..వ్యాక్సిన్, థ్రెడింగ్ అంతగా ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ పాపులర్ కాలేదు, ఎందుకంతే దీని చుట్టూ కొన్ని భ్రమలు, అవాస్తవాలు అల్లుకుని ఉన్నాయి. హెయిర్ రిమూవల్ క్రీమ్స్ లో హాని కారక కెమికల్స్ ఉన్నాయనీ, ఎక్కువ సార్లు యూజ్ చేస్తే స్కిన్ డార్క్ గా అయిపోతుందనీ ఎప్పటి నుండో మనకి చెబుతున్నారు.

హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కంటే వ్యాక్సింగ్, థ్రెడింగ్ కి తక్కువ మైనస్ పాయింట్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడకంలో పెయిన్ ఉండదు, వాడడం తేలిక, ఎక్కువ ఖర్చు కాదు, శరీరం లో ఎక్కడ ఉండే హెయిర్ నైనా ఈజీగా రిమూవ్ చేసేయవచ్చు. అంతే కాక, ఈ ప్రాసెస్ అంతా చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. పైగా ఇది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, సెలూన్‌కి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు.