Jaggery Chai: చాయ్ లో బెల్లం కలుపుకుని తాగొచ్చా..?

చక్కెర ఆరోగ్యానికి చేటు అనే అవగాహన క్రమంగా పెరుగుతోంది. కొందరు చక్కెర మానేస్తున్నారు. బెల్లానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 23, 2022 / 06:30 AM IST

చక్కెర ఆరోగ్యానికి చేటు అనే అవగాహన క్రమంగా పెరుగుతోంది. కొందరు చక్కెర మానేస్తున్నారు. బెల్లానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చాయ్ లో బెల్లం, తేనె కలుపుకుని తాగుతున్నారు. కానీ ఆయుర్వేదం మాత్రం చాయ్, బెల్లం కలయిక సరైందని కాదని చెబుతోంది.

ఆయుర్వేదం ప్రకారం…విరుద్ధ ఆహారం లేదా అసహజమైన పదార్థాల కలయికతో తీసుకునే ఆహారం ఆమ గుణానికి దారితీస్తుంది. అంటే జీర్ణవ్యస్థపై ప్రభావం చూపించే హానికారకాలు విడుదల అవుతాయని అర్ధం. ప్రతి ఆహారానికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇవి రుచి, శక్తి, జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బెల్లం వేడిని కలిగిస్తుంది. పాలు చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. మరీ చాయ్ లో సహజతీపిని ఎలా తీసుకోవాలి అనే ప్రశ్నకు మిశ్రి లేదా రాక్ షుగర్ మంచిదని..పాలు మాదిరే చల్లటి గుణంతో ఇది ఉండటం వల్ల అనుకూలమని వెల్లడించారు.

ఇక ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంపై ప్రభావం చూపించే…అసహజ కలయికల్లో అరటిపండు-పాలు, పాలు-చేపలు, పెరుగు-వెన్న, తేనె-నెయ్యి, ఇలాంటి పొందికలేని పదార్థాలను కలిపి తీసుకుంటే శరీరంలోవాపు, చర్మ సమస్యలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు తెలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.