Breakfast: ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిందేనా..?

ప్రతిరోజూ ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 09:48 AM IST

ప్రతిరోజూ ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. సమయానికి తగినంత ఆహారం పొట్టలో లేనట్లయితే…జీవక్రియ దెబ్బతింటుంది. కానీ కొంతమంది గ్లాసు పాలు…చిన్న పండుతో బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ అనుకుంటారు. కానీ ఇలా చేసినట్లయితే…మళ్లీ కొద్దిసేపటికే ఆకలివేస్తుంది. కనిపించినవన్నీ తినాలి అనిపిస్తుంది. దీంతో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పొట్టలో ఆకలి అవుతుంటే…మనంచేసే పనిపై ఏకాగ్రతా లోపిస్తుంది.

ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా తినాలి. గబగబా తినకూడదు. పెద్ద పెద్ద ముద్దలు అస్సలు మింగకూడదు. అలా చేస్తే మోతాదుకు మించి ఆహారం తీసుకున్నట్లు అయితుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నెమ్మదిగా నమిలి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలన్నీ కూడా శరీరానికి అందుతాయి.

పొట్టనిండుతే చాలు అన్నట్లు కాకుండా ప్రొటీన్లు, మంచి కొవ్వులు ఉన్న అల్పాహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లతోకూడిన ఆహారం చాలా సేపు ఆకలిని దూరం చేస్తుంది. బలాన్నీఇస్తుంది. సోయా, పప్పుగింజలు,పాలు పన్నీర్, గుడ్డు వంటివి అధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

కొంతమంది కార్బొహైడ్రేట్స్ కు దాదాపుగా దూరంగా ఉంటారు. పూర్తిగా ప్రొటీన్స్ మీదే ఆధారపడతారు. ఇలా చేస్తే రక్తంలో చక్కెర శాతం పడిపోతుంది. ప్రొటిన్స్, కార్బొహైడ్రేట్స్ ఉన్న అల్పాహారాన్ని తీసుకోవాలి. ఉప్మా, అటుకులు, ఓట్స్ లాంటివి అప్పుడప్పుడు తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ లో నెయ్యి, వెన్న, వేరుశనగలు, అవిసెలు కూడా చేర్చాలి. ఇవి శరీరానికి మంచి కొవ్వును అందిస్తాయి. ఇందులో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్, గుండెకు మేలు చేస్తాయి.

ఉదయం అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాం…రాత్రి ఆలస్యంగా తిన్నాం….లేదంటే ఇంకో కారణంతో…తినడం మానేస్తే క్యాలరీలు తగ్గించుకోవచ్చని…చాలామంది అల్పాహారం మానేస్తుంటారు. కానీ ఇది జీవక్రియ మీద దుష్క్రభావాన్ని చూపిస్తుంది. రక్తంలో కొవ్వు శాతం పెరగడం, గుండ సమస్యలు, షుగర్ వంటి ఇబ్బందులకు దారితీస్తుంది.