Site icon HashtagU Telugu

Anxiety Pain: ఒత్తిడి వల్ల కడుపు నొప్పి వస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి!

Stomach Pain

Stomach Pain

ప్రస్తుత బిజీ కాలంలో మనుషులు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్థిక సమస్యలు కావొచ్చు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు.. ఇలా చాలా సమస్యలు మనిషిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనషులకు ఎదురయ్యే, ఎదుర్కొనే చాలా సమస్యలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒత్తిడి వల్ల తలనొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రెజర్ అధికంగా అవ్వడం వల్ల సరిగ్గా తినకపోవడం, ఆరోగ్యం గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు.

అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. కొంతమంది స్నేహితులతో సరదాగా గడపటం, మరికొంతమంది ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం.. మరికొంతమంది తమకు ఇష్టమైన పనులు చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకోంత మంద తమకు ఇష్టమైన వ్యక్తులతో గడుపుతూ ఉంటారు.

లక్షణాలేంటి?

హార్ట్ బీట్ ఎక్కువగా కోట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, హైపర్ వెంటిలేషన్, చెమటలు పట్టడం, నోరు ఎండిపోవడం, చలి వేయడం, ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు, నీరసం, అలసట, నిద్రలేమి సమస్యలు లాంటివి చాలా ఉంటాయి.

ఇక టెన్షన్ పడటం, ఇరిటేషన్, ఏకాగ్రత పెట్టలేకపోవడం, ఆలోచనలు రాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి మరింత ఎక్కువ అయినప్పుడు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఇక ఒత్తిడిలోనూ చాలా రకాలు ఉన్నాయి. యాంగ్జైటీ ఎటాక్, ప్యానిక్ ఎటాక్ అంటూ ఉంటారు. యాంగ్జైటీ అటాక్ ఒత్తిడిని కలిగించే వాటి వల్ల వస్తుంది. దీని వల్ల ఇబ్బంది పడటం, భయపడటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ప్యానిక్ ఎటాక్ లో అయితే శారీరక లక్షణాలు చాలా సివియర్ గా ఉంటాయి. అయితే ఏ ఎటాక్ అయినా ఒత్తిడి లేదా భయం కలుగుతాయి. ఏది ఏమైనా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

Exit mobile version