Iron Deficiency : భారతీయుల్లో చాలామంది తగిన మోతాదులో ఐరన్, క్యాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం లేదని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారతీయ పురుషులతో పోలిస్తే మహిళల్లో అయోడిన్ లోపం ఎక్కువగా ఉందని తేలింది. ఇక భారతీయ మహిళలతో పోలిస్తే పురుషుల్లో జింక్, మెగ్నీషియం లోపం(Iron Deficiency) ఎక్కువగా ఉందని వెల్లడైంది. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన హార్వర్డ్ టి.హెచ్.ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూసీ శాంటా బార్బరా, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ పదేళ్ల పాటు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో ఈవివరాలను గుర్తించారు. ఈ నివేదికను తాజాగా ది లాన్సెట్ జర్నల్ ప్రచురించింది.
We’re now on WhatsApp. Click to Join
- ఈ అధ్యయనం భారత్ సహా 185 దేశాలలో జరిగింది.
- 185 దేశాల ప్రజలు 15 రకాల సూక్ష్మపోషకాల లోపంతో బాధపడుతున్నట్లు స్టడీలో తేలింది.
- ప్రపంచ జనాభాలో 99.3 శాతం మందికి ఆహారం ద్వారా సరిపడా సూక్ష్మ పోషకాలు అందడం లేదని వెల్లడైంది.
- ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తగినంత అయోడిన్, కాల్షియం, విటమిన్-ఈ తీసుకోవడం లేదని నివేదికలో పేర్కొన్నారు.
- కొన్ని దేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు అయోడిన్, బీ12, ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
- మహిళలతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులు మెగ్నీషియం, విటమిన్ బీ6, జింక్, విటమిన్ సీని తగినంతగా తీసుకోవడం లేదని తేలింది.
- దక్షిణాసియా, ఆగ్నేయాసియా, సబ్ సహారా ఆఫ్రికాలో 10 నుంచి 30 ఏళ్లలోపు పురుషులు, మహిళలు శరీరానికి అవసరమైన దానికంటే తక్కువగా కాల్షియం తీసుకుంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
Also Read :Vinesh Phogat : రైతులను విస్మరిస్తే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది : వినేష్ ఫోగట్
- మన శరీరం చురుగ్గా పనిచేయాలంటే ఐరన్, కాల్షియం ముఖ్యం. హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ఐరన్‌ది కీలక పాత్ర.
- ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం.
- శరీరంలో ఐరన్, కాల్షియం తక్కువైతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- సప్లిమెంట్స్ వాడటం కంటే కాల్షియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలను అందించే పండ్లు, ఆహారాలు తీసుకోవడం మంచిది.
- పాలు, పాల పదార్థాల నుంచి కూడా కాల్షియం పొందొచ్చు.
- గోంగూర సహా పలు రకాల ఆకుకూరలు ఐరన్ లోపం రాకుండా కాపాడుతాయి.